మ‌రింత ప‌త‌నం దిశ‌గా కాంగ్రెస్‌.. కీల‌క నేత దూరం?

Update: 2022-08-22 04:14 GMT
సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగిపోయే ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే పార్టీ అద్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టే నాయ‌కుడు లేక‌.. ఈసురోమంటున్న కాంగ్రెస్‌కు మ‌రి భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. కీల‌క నాయ‌కుడు.. గాంధీ ల కుటుంబానికి వీర విధేయుడిగా పేరున్న ఆనంద్ శ‌ర్మ త్వ‌ర‌లోనే పార్టీకి రాజీనామా చేయ‌నున్నార‌నే వార్త ఢిల్లీలో గుప్పుమంది. దీనికి త‌గిన‌ట్టుగానే ఆయ‌న కూడా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా ఆనంద్ శ‌ర్మ‌.. హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.

పార్టీ సమావేశాలకు తనను ఆహ్వనించడం లేదని.. అందుకే తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన జీ23 నేత గులాం నబీ ఆజాద్ బాటలోనే శర్మ పయనించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం మాత్రం తైను పని చేస్తానని కాంగ్రెస్ అధినేత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఆనంద్ శర్మ. కానీ, ఆయ‌న బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే పార్టీ మారిపోవ‌డం ఖాయ‌మ‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆనంద్ శర్మ అంతకుముందు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ డిప్యూటి లీడర్గా సేవలు అందించారు. ఆయన్ను ఏప్రిల్ 26న హిమాచల్ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్గా నియమించారు.

ఈ కమిటీలో దిగ్గజ నేతలు భూపిందర్ సింగ్ హుడా, మనీశ్ తివారీ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో బలమైన నేతగా ఉన్నారు ఆనంద్ శర్మ. 1984లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కానీ, కొన్నాళ్లుగా ఆయ‌న జీ-23 అసమ్మ‌తి నేత‌ల వ్యాఖ్య‌లకు మ‌ద్ద‌తిస్తున్నారు. ప్ర‌తి విష‌యా న్నీ.. ఆయ‌న కూడా విమ‌ర్శిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం పార్టీని ఉలికిప‌డేలా చేసింది. ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వా జోరుగా సాగుతున్న క్ర‌మంలో ఆయ‌న హ‌వాకు అడ్డుక‌ట్ట వేయాల‌ని.. పార్టీ భావిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. దీనికి సంబంధించి.. ఎలాంటి వ్యూహం లేక పోగా.. కీల‌క నాయ‌కులు పార్టీకి దూరం కావ‌డం.. అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టేందుకు సోనియా, రాహుల్ గాంధీలు ముందుకు రావ‌డం లేదు. ఈ ప‌రిణామాలే.. పార్టీని కుంగ‌దీస్తుంటే.. మ‌రోవైపు ఒక్కొక్క‌రుగా కీల‌క నాయ‌కులు.. బ‌ల‌మైన గ‌ళం వినిపించే నాయ‌కులు దూరం కావ‌డం.. పార్టీని ఎటు తీసుకువెళ్తుందో అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నాయి.
Tags:    

Similar News