కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క సంచలనం కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరడం లేదంటూ.. దీనికి ఆమె విలవిలలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు అధోగతి పాలు అవుతున్నారని ధ్వజమెత్తారు. ఏ ఆత్మ గౌరవం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అదే లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన - బడుగు - బలహీన వర్గాల ఆత్మగౌరవం - ఆత్మాభిమానం కోసం పోరాటం సాగుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ప్రచార స్ట్రాటజీ పేపర్ ముసాయిదాను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
ఇసుక మాఫియా రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావరి రీడిజైన్ వల్ల ఒక్క చుక్క నీరు కూడా నీరు రాకుండా పోయిందని మండిపడ్డారు.ఫ్యూడల్ ప్రభుత్వాన్ని దించి ప్రజల ఎజెండానే మా అజెండాగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలకు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు .. ఫ్యూడల్స్ కు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా భట్టి పోల్చారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం మీడియా మీద కూడా ఆంక్షలు విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు..