ఏపీ అంటే ఏంటో మరి రాజకీయ నాయకులకు అలా ఉచిత వరాలు ఇచ్చేసి ఆ మీదట మరచిపోవాలని అనిపిస్తుందేమో. అయిదు కోట్ల మంది ఏపీ జనం కూడా ఈ దేశంలో పౌరులే అన్న ఆలోచన కూడా ఉండదేమో. అందుకే పాచిపోయి జనాలు విసిగి వేసారిపోయిన హామీలను కూడా మళ్లీ మళ్ళీ కొత్తగా జనంలోకి తెస్తూ తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి సరికొత్త డ్రామాలకు తెర తీస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ నాయకుడు జై రాం రమేష్ అన్నాయన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తున్న వేళ దానికి ఘన స్వాగతం పలకాలని జనాలను కోరుతున్నారు. పనిలో పనిగా మీడియా మీటింగ్ పెట్టి మరీ ఏపీ జనాలకు ఒక హామీ ఇచ్చి పడేశారు. కాంగ్రెస్ పార్టీ 2024లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, ప్రధానిగా రాహుల్ గాంధీ తొలి సంతకం ఆ ఫైల్ మీదనే అంటూ చాలా చక్కగా చెప్పేశారు.
అయితే ఇదే జైరాం రమేష్ తాను మరచిపోయారు కానీ ఏపీ జనాలకు ఆయన బాగా గుర్తుంటారు. విభజన చట్టాన్ని ఆయన దగ్గరుండి చూసి మరీ డ్రాఫ్టింగ్ చేశారని చెబుతారు. మరి ఆనాడే ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టాలని ఆయనకు ఎందుకు అనిపించలేదో అన్నది జనం మాట, బాధ, విమర్శ కూడ. ఇక చివరాఖరున విభజనకు అంతా అయిపోయాక తాపీగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రత్యేక హోదా మీద నోటి మాట హామీ ఇచ్చేశారు. కానీ అది చట్టంలో మాత్రం చేర్చనేలేదు.
అలా కాంగ్రెస్ తన నిర్వాకం తాను చేసి ఏపీ జనాలను తన్నుకుని చావమంది. దీని కంటే ముందు అడ్డగోలు విభజన కూడా ఏపీ జనం నెత్తిన పెను శాపంగా పెట్టి ఆంధ్రా అంటే అభివృద్ధి అన్న దాని అర్ధం మార్చి అప్పులు అన్నట్లుగా ఈ రోజు జరుగుతున్న కధ వెనక కాంగ్రెస్ అవకతవక విభజన ఉందని అన్నది ఆంధ్రులందరికీ తెలుసు అంటున్నారు.
ఇపుడు ఎన్నికలు ఉన్నాయి. అవసరాలు ఉన్నాయి. అందుకే మరోమారు ప్రత్యేక హోదా మీద హామీ ఇచ్చేసి తీయని కబుర్లు కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు అని అంటున్నారు. రేపటి రోజున కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రాలేదు, కూటములతో వస్తే పక్కన ఉన్న తమిళనాడు ఊరుకుంటుందా లేక బీహార్ తనకు ప్రత్యేక హోదా ఇవ్వమని పేచీ పెట్టకుండా ఉంటుందా. అలా సవాలక్ష కారణాలు చెప్పేసి హొదా హామీని మడతేయరని గ్యారంటీ ఏముంది. ఇలాంటి ప్రశ్నలు సందేహాలు ఎన్నో ఉన్నాయి. అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి మాట కదా అది.
ఇప్పటికి చూస్తే ఫుల్ మెజారిటీతో బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అయినా ప్రత్యేక హోదా అన్నది ఇవ్వలేమని అది ముగిసిన అధ్యాయమని చెబుతూ మోసం మీద మోసం చేస్తూ వస్తోంది. నాటి బీజేపీ పెద్దలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఏపీ జనాల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టారు. ఇక పోలవరం పూర్తికి కూడా నానా రకాలైన అడ్డంకులు పెడుతూ ఏపీని ఏడిపించుకుని తింటున్న జాతీయ పార్టీలు, వాటికి తందానా అంటూ సలాం కొడుతూ మద్దతుగా నిలిచే ప్రాంతీయ పార్టీలతో ఏపీ జనం పూర్తిగా విసిగిపోయారనే అంటున్నారు.
ప్రత్యేక హోదా కోసం విభజన హామీల సాధన కోసం బీజేపీతో చేతులు కలుపుతున్నామని చెప్పి చంద్రబాబు నాడు ఓట్లేయించుకుని సీఎం అయ్యారు. ఆయన జమానాలోనే హోదా కాలగర్భంలో కలసిపోయింది. ఇక కేంద్రంలో ఎవరున్నా ఎంతటి పెద్దలు ఉన్నా వారి మెడలు వంచి హోదాను సాధించుకుని వస్తామని చెప్పిన జగన్ కూడా మూడున్నరేళ్ళుగా ఏమీ చేయకుండానే గడిపేశారు. హోదా బదులు పాచిపోయిన లడ్లు ఇస్తారా అంటూ బీజేపీ మీద హూంకరించిన జనసేనాని చివరికి వారితోనే చేతులు కలిపి మిత్రుడుగా మారిపోయిన రాజకీయ విన్యాసాలు వైనాలు కళ్ళముందే ఉన్నాయి.
అందువల్ల ప్రత్యేక హోదా హామీ అంటే మాత్రం ఏపీ జనాలు రాజకీయ పార్టీల వైఖరిని చూసి ఏహ్య భావాన్నే పెంచుకుంటున్నారు అని అంటున్నారు. అందుకే మోసం చేయడానికి అది కూడా పదే పదే వంచించడానికి ఏపీ జనాలే కావాలా అంటూ నాయకుల మీద గుస్సా అవుతున్నారు. ఆ హామీ వద్దు కానీ మరేదైనా కొత్త మాట చెప్పడని కూడా ఏపీ జనాలు సెటైర్లు వేస్తున్నారు. అదండీ మ్యాటర్. సో జై రాం రమేఅష్ గారు ప్రత్యేక హోదా అంటూ వేలాడడం మానేస్తే బెటర్. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రేపటి రోజున అద్భుతం జరిగి కాంగ్రెస్ కేంద్రంలో పవర్ లోకి వస్తే ఆ మాట ఏదో చేతలో చేయించి చూపిస్తే ఏపీకి వచ్చినపుడు ఆయనకు అయిదు కోట్ల జనాలే ఘన సన్మానం చేస్తాయి. ఇది నిజం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.