అదేమి బస్సు యాత్ర. వట్టి తుస్సు యాత్ర. ఇదీ కాంగ్రెస్ పెద్దాయన. కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత చింతా మోహన్ హాట్ హాట్ కామెంట్స్. వైసీపీ వారి సామాజిక న్యాయమా అది ఎక్కడ ఉంది అంటూ ఆయన నిలదీసిన తీరుకు వైసీపీ సర్కార్ పెద్దలు నివ్వెరపోవాల్సిందే. తాజాగా విశాఖ టూర్ లో చింతా మోహన్ వైసీపీ సర్కార్ మీద నిప్పులే చెరిగారు.
సామాజిక న్యాయా భేరీ పేరిట జనాలను మభ్యపెడితే మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని కూడా ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్ హయాంలో బడుగులకు అన్ని విధాలుగా తీరని అన్యాయమే జరిగింది అని గణాంకాల ద్వారా వివరించగలమని ఆయన సవాల్ చేశారు.
దళితులకు వైసీపీ ఏలుబడిలో తీరని అన్యాయమే జరుగుతోందని ఆయన అన్నారు. ఏకంగా 67 వేల మంది దళిత విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు ఎగ్గొట్టిన ఘనత వైసీపీదే అని అన్నారు. దేశంలో 28 రాష్ట్రాలో ఇస్తున్న స్కాలర్ షిప్పులు ఏపీలో ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో విద్యా దీవెన అని చెబుతున్నారు కానీ అది చదువుని చిదిమేసే దీవెన అని ఎద్దేవా చేశారు. విదేశాలకు వెళ్ళి చదువుకుందామనుకే వారికి ప్రోత్సాహకాలు ఏవీ అని ఆయన నిలదీశారు. బస్సు యాత్ర అని చెప్పుకుంటూ తిరిగిన మంత్రుల మాటలను ఖాళీ కుర్చీలే విన్నాయి తప్ప బడుగులు దళితులు కానే కాదని ఆయన అన్నారు.
నేతి బీరకాయ లాంటి వైసీపీ సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ ఎండగడుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడలేకపోతున్నారని చింతామోహన్ మండిపడ్డారు.
అంబేద్కర్ ప్రపంచ మేధావి అని ఆయన పేరుని దక్షిణ భారతదేశానికే పెట్టాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. మొత్తానికి జనం లేని వైసీపీ బస్సు యాత్ర తుస్సు యాత్ర కాక మరేమిటి అని ఆయన సంధించిన బాణాలు వైసీపీ నేతలకు ఎక్కడో గుచ్చుకుంటున్నాయట.