టీఆర్ ఎస్ పై సీనియర్ పొలిటిషియన్ - కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇరిగేషన్ శాక మంత్రి హరీష్ రావుపై నాగం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ పెద్ద యూజ్ లెస్ ఫెల్లో అని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని టీఆర్ ఎస్ నేతల వ్యాఖ్యలను నాగం తీవ్రంగా ఖండించారు. ఎవరి కాళ్లలో కట్టెలు పెట్టమాని? హరీష్ రావు కాళ్లలో పెట్టినారా లేక కేసీఆర్ కాళ్లలో పెట్టినారా అని నాగం ప్రశ్నించారు. ఎవరికి ఎవరు అడ్డు పెడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసని టీఆర్ ఎస్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవినీతే రాష్ట్రాభివృద్ధికి అడ్డంకి అని పొరపాటున వ్యాఖ్యానించిన నాగం....వెంటనే నాలిక కరుచుకున్నారు. టీఆర్ ఎస్ అవినీతే అభివృద్ధికి అడ్డంకి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారంనాడు కాంగ్రెస్ పార్టీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించిన నాగం అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నాగం ప్రశంసలు కురిపించారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన 108 - ఆరోగ్య శ్రీ - ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాయని ప్రశంసించారు.
తెలంగాణ లో టీఆర్ ఎస్ హయాంలో అవినీతి రాజ్యమేలుతోందని....త్వరలోనే కేసీఆర్ - హరీష్ ల అవినీతి బట్టబయలు చేస్తానని నాగం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజలకు బాంబే తమాషా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉపయోగించిన మోటార్లు కాంగ్రెస్ హయాంలోవి కాదా ..అని ప్రశ్నించారు. ఆ విషయం గురించి తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు - ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీ అటకెక్కాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు 100 సీట్లు ఎలా వస్తాయో చూసుకుందామని సవాల్ విసిరారు. తనకు భద్రతను తొలగిస్తే భయపడనని - ప్రజలే తనకు సెక్యూరిటీ అని అన్నారు. తాను రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే ప్రశ్నిస్తున్నానని - తప్పు చేస్తే జైలు శిక్షకు కూడా సిద్ధమని అన్నారు. డబ్బులను దోచుకోవడం - దాచుకోవడం కోసమే ఆ ప్రాజెక్టుకు రీడిజైన్ - రీఎస్టిమేషన్ లు వేస్తున్నారని మండిపడ్డారు.