మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్యకు బెయిల్ మంజూరైంది. కోడలు సారిక, మనవళ్ల మృతి కేసులో ఆయన జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనవళ్లు అగ్నికి ఆహుతై మృతి చెందారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా తాజాగా రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ లకు షరతులతో కూడిన బెయిల్ ను వరంగల్ న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే అనిల్ రెండో భార్య సనాకు మాత్రం బెయిల్ ను నిరాకరించింది.
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల అభ్యర్థిగా బరిలో దిగిన సందర్భంగా ఆయన కుటుంబంలో ఈ ఘటన జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బరిలో నుంచి తప్పించి సర్వే సత్యనారాయణను రంగంలోకి దించింది. ఆ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరఫున పోటీలో నిలిచి పసునూరి దయాకర్ భారీ మెజార్టీతో గెలుపొందగా...సర్వేకు డిపాజిట్ గల్లంతయ్యింది.