కాంగ్రెస్ పార్టీలో ఎందరు అగ్రనేతలు ఉన్నప్పటికీ, వారికి ఎంత ఘన చరిత్ర ఉన్నా నెహ్రూ, గాంధీ కుటుంబీకుల ప్రభావంతో వారెవరికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇందుకు ప్రపంచ ప్రఖ్యాత మేధావి, మన దేశ మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు ప్రత్యక్ష ఉదాహరణ. దేశ ప్రధాని పీఠం అధిష్టించిన ఏకైక తెలుగువాడుగానూ, అందులోనూ తెలంగాణకు చెందిన వాడిగా పీవీకి పేరుంది. పీవీ నర్సింహారావు తన జీవిత కాలమంతా కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ఆదుకున్నారు. ఇంతటి ఘనకీర్తి ఉన్న పీవీ నర్సింహారావు మరణానంతరం కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వలేదన్నది వాస్తవం.
పీవీ మరణించిన అనంతరం దహన సంస్కారాలు కూడా సరిగా నిర్వహించలేదని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అందరు ప్రధాన మంత్రులకు ఢిల్లీలో ఘాట్ లు ఉండగా...పీవీకి మాత్రం ఆ గౌరవం దక్కకపోవడం కూడా గమనార్హం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పీవీ నరసింహారావుకు మధ్య బేధాభిప్రాయాలే ఇందుకు కారణమనేది లోకవిధితం. అధినేత్రికి నచ్చని వ్యక్తిని గౌరవిస్తే ఏం చిక్కువచ్చిపడుతుందోనని కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం పీవీ జయంతి, వర్ధంతులను తూతూ మంత్రంగా జరిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ఢిల్లీ నుంచి గల్లీ కాంగ్రెస్ లీడర్ల వరకూ పీవీ జపం చేయడం మొదలు పెట్టారు. ఇందుకు కారణం లేకపోలేదు. అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో పీవీ పేరిట స్మారకాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటీఆర్‌ఎస్ పార్టీ సైతం పీవీ జయంతి వేడుకలను అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తోంది. ఇదంతా తెలుసుకొని సర్దుకున్న కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగిన తప్పును సరిదిద్దుకోవడం కోసం ఈ సారి ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ పీవీ జయంతి వేడుకలకు హాజరయ్యారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే ఈ జయంతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని ఎన్నో వేడుకల్లో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన జయంతి వేడుకలకు రాకపోవడం ఏం సందేశాన్ని పంపిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి పీవీ జయంతి వేడుకలను గత ఏడాది నిర్వహించినపుడు పీవీ తెలంగాణ బిడ్డ అవడం ప్రజల అదృష్టమని, ఆయన పేరుమీద ఒక జిల్లా, యూనివర్శిటీ, ట్యాంక్ బండ్‌లో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ చెప్పారని... ఇంతవరకు అమలు జరగలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు రెండోసారి పీవీ జయంతి వేడుకలకు కేసీఆర్ హాజరుకాకపోవడంపై వారు మండిపడ్డారు. దీన్ని బట్టే ముఖ్యమంత్రికి తెలంగాణ పెద్దల పట్ల ఉన్న అభిమానం తేటతెల్లం అయిందని మండిపడ్డారు.
మొత్తానికి తాము గతంలో పెద్దగా పట్టించుకోని పీవీ గురించి ఇపుడు కాంగ్రెస్ నేతలే ముఖ్యమంత్రిని నిలదీస్తూ మాట్లాడటం ఆసక్తికర పరిణామమే.