పీవీ జయంతికి కేసీఆర్‌ ఎందుకు రాలేదంటే..!

Update: 2015-06-29 12:30 GMT
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తెలంగాణ గర్వించతగిన బిడ్డ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం వ్యాఖ్యానించారు. కానీ, ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆయన జయంతి వేడుకలకు మాత్రం కేసీఆర్‌ హాజరు కాలేదు. దీనికి సంబంధించి ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది.

బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు కదా! బాబ్రీ విధ్వంసంలో ముస్లిములు బీజేపీ నేతలను తప్పు పడుతూనే అదే సమయంలో అప్పట్లో ప్రధానిగా ఉన్న పీవీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు కదా! ఈ నేపథ్యంలో పీవీ జయంతి వేడుకలకు వెళితే ముస్లిములకు కోపం తెప్పించినట్లు అవుతుందేమోనని కేసీఆర్‌ భావించారని, అందుకే ఆయన జయంతి వేడుకలకు రాలేదని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అతి త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉండడం.. ఇక్కడ ముస్లిముల ఓట్లు కీలకం కావడంతో ఈ సమయంలో ముస్లిములకు ఆగ్రహం తెప్పించడం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆయన గైర్హాజరు అయ్యారని అంటున్నారు.

పీవీ జయంతి వేడుకలను కేంద్రంలో కూడా ఘనంగా నిర్వహించడం.. కాంగ్రెస్‌ మాజీ ప్రధాని జయంతిని బీజేపీకి చెందిన ప్రధాని మోదీ ఘనంగా నిర్వహించడమే కాకుండా స్వయంగా హాజరయ్యారని, కానీ, తెలంగాణ గర్వించదగిన బిడ్డ జయంతి వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కాలేదని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News