షాకింగ్ న్యూస్‌.. రాజ‌గోపాల్‌పై అధిష్టానం సీరియ‌స్.. స‌స్సెన్ష‌న్ ఖాయం?

Update: 2022-07-26 07:30 GMT
కాంగ్రెస్ బుజ్జ‌గింపులను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. త‌న మానాన త‌ను వ్యాఖ్య‌లు చేస్తూ.. కాంగ్రెస్‌ను ఇర కాటంలోకి నెడుతున్న మునుగోడు ఎమ్మెల్యే.. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపా ల్‌రెడ్డిపై.. కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్ అయిన‌ట్టు తెలిసింది. వ‌రుస‌గా రెండు రోజుల పాటు ఆయ‌న‌తో కీల‌క నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క భేటీ అయ్యారు. పార్టీని వీడొద్ద‌ని.. పార్టీలో మంచి పొజిష‌న్ ఉంటుంద‌ని ఆయ‌న సూచించారు. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌గోపాల్ త‌న ప‌ద్ధ‌తిని వీడ‌లేదు.

అంతేకాదు...రేవంత్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జైలుకు వెళ్లి వ‌చ్చిన వారు మాకు నీతులు చెబుతున్నా రంటూ.. కామెంట్లు చేశారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయ‌కులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌ని చెప్పారు. బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ దూకుడు కాంగ్రెస్‌లో లేద‌ని.. అన్నారు. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన వారు పెత్త‌నం చేస్తున్నార‌ని అన్నారు. ఈ ప‌రిణామాలతో ఆయ‌న పార్టీ విష‌యంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని అంద‌రికీ అర్ధ‌మైంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా భ‌ట్టి.. ఒక నివేదిక‌ను రేవంత్‌కు ఇవ్వ‌డం.. దానిని ఆయ‌న ఫ్యాక్స్ ద్వారా.. ఢిల్లీకి పంపించ‌డం జ‌రిగిపోయాయి. దీనిపై పార్టీ అధిష్టానం.. ప‌రిశీలించి.. ఈ రోజు రేప‌ట్లోనే నిర్ణ‌యం తీసుకుం టుంద‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నారు. రాజ‌గోపాల్ వంటి నాయ‌కుల‌ను ప‌క్క‌కు త‌ప్పించ‌డ‌మే మంచిద ని.. చాలా మంది నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఇప్పుడు త‌ప్పించ క‌పోతే.. మ‌రింత మంది వ్య‌తిరేకులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

దీంతో క‌ఠిన నిర్ణ‌యాల దిశ‌గానే పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈ రోజో.. రేపో.. రాజ‌గోపాల్‌ను స‌స్పెండ్ చేస్తూ.. ఉత్త‌ర్వులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ కాంగ్రెస్‌లో గుస‌గుస వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే.. తాజాగా సీత‌క్క నిర్వ‌హించిన దీక్ష‌లో వీహెచ్‌.. రాజ‌గోపాల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

పార్టీ పెట్టిన తిండి తింటూ.. పొరుగు పార్టీకి సేవ‌లుచేసేవారు పెరిగిపోయారంటూ.. ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. మొత్తానికి రాజ‌గోపాల్‌పై స‌స్పెన్ష‌న్‌ను ఖాయ‌మ‌ని.. తెలిసిపోయింది. ఇక‌, ప్ర‌క‌ట‌నే త‌రువాయి అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు.
Tags:    

Similar News