తెలంగాణలో హిమాచల్ ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్

Update: 2022-12-18 01:30 GMT
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. బీజేపీని ఓడించింది. హోరాహోరీ పోరులోనే గెలుపు గుర్రం ఎక్కింది. ఈ క్రమంలోనే అదే ఫార్ములాను దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో అనుసరించిన వ్యూహంతోనే ముందుకెళ్లాలని భావిస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణలోనూ హిమాచల్ లో అనుసరించిన వ్యూహంతోనే ముందడుగు వేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. త్వరలోనే ప్రియాంకాగాంధీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు.

రాహుల్ గాంధీ జోడోయాత్ర పూర్తయ్యాక ప్రియాంకా గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేయవచ్చని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ ప్రతి నియోజకవర్గం నేతలతో కార్యకర్తలతో భేటి కావడమే కాదు.. ప్రతీ వీధి,ప్రతీ ఇల్లు తిరిగి పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక సమస్యలతోపాటు వివిధ వర్గాల సమస్యలను తెలుసుకున్నారు. వాటిపై ఫోకస్ చేసి ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు. ఫలితంగా తిరుగులేని మెజార్టీతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంది.  

ఇప్పుడు ఇదే ఫార్ములాని ప్రియాంక గాంధీ తెలంగాణలోనూ అమలు చేసే అవకాశం ఉ:ది. మహిళా మోర్చా ర్యాలీలతో ప్రతీ ఇల్లు, ప్రతీ గల్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నా నేతల పనితీరు వల్లే పార్టీ బలోపేతం కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈక్రమంలోనే తెలంగాణలో నేతల మధ్య విభేదాల కారణంగానే ఆ పార్టీ ప్రజల్లో మన్ననలు పొందలేకపోతోందని.. ఈ మేరకు అసమ్మతి తగ్గించి నేతలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రియాంక గాంధీ తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారని ఆ పార్టీ నేత మధుయాష్కీ తెలిపారు. పార్టీకి ప్రజల మద్దతు ఎందుకు లేదనే దానిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సమీక్ష సమావేశం జరుగుతుందని చెప్పారు. సమీక్షలతో పాటు దిద్దుబాటు చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ప్రియాంక మార్క్ స్పష్టంగా కన్పించనుంది. ప్రియాంక గాంధీ  తనకంటూ ఓ టీమును సెట్ చేసుకునే పనిలో పడ్డారని సమాచారం. ఈ టీముతోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు వెళుతారనే టాక్ విన్పిస్తుంది. అందుకే ప్రియాంకకు ఈ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారని సమాచారం.

రేవంత్ రెడ్డి వల్ల సీనియర్లు దూరం కాకుండా చేయడం.. రేవంత్ తో సీనియర్లకు ఉన్న సమస్యలు తీర్చడం.. దీంతోపాటు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ల తొలగింపులనకు రంగం సిద్ధం చేస్తున్నారు. అసమ్మతి రాజేస్తున్న జగ్గారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఇక అజారుద్దీన్ పనిచేయడం లేదు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసేసి కొత్తవారిని పెట్టాలనుకుంటున్నారు.

ముఖ్యంగా గెలుపు అవకాశాలున్న రాష్ట్రాలపై ఫోకస్ చేసినట్టు సమాచారం. తెలంగాణ ఈసారి విజయంపై ఆశతోనే కీలకమైన ఈ రాష్ట్రానికి ప్రియాంకను ఇన్చార్జిగా పెట్టినట్టు తెలుస్తోంంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News