చట్టాలు చేయాల్సిన ఎమ్మెల్యేలే దాన్ని బంధుప్రీతికి పక్కనపెడుతున్న వైనం విస్తుగొలుపుతోంది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తాజాగా ఓ ఎమ్మెల్యే మద్యం సేవించి వాహనాలు నడిపితే తప్పేంటి అంటూ పోలీసులను ప్రశ్నించాడు. అనక డ్రంకెన్ డ్రైవ్ లో అరెస్ట్ అయిన తన బంధువును విడుదల చేయాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ధర్నాకు దిగిన వైనం విస్తుగొలుపుతోంది.
రాజస్థాన్ కు చెందిన అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ దంపతులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన వైనం సంచలనమైంది. జోధ్ పూర్ పోలీసులు తాజాగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ మేనల్లుడు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మీనా పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పైగా తాగి వాహనం నడిపిన మేనల్లుడిని ఎమ్మెల్యే వెనుకేసుకురావడం విశేషం. ఈరోజుల్లో పిల్లలందరూ మద్యం తాగుతున్నారు. అయినా తాగితే తప్పేంటి? అదేమంత పెద్ద విషయం కాదు.. నా మేనల్లుడిని తక్షణమే విడుదల చేయండి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిందితుడిని విడిచిపెట్టేందుకు మాత్రం పోలీసులు నిరాకరించారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్, తన భర్త ఉమైద్ సింగ్ తో కలిసి పోలీస్ స్టేషన్ లోనే ధర్నాకు దిగడం సంచలనమైంది. అనంతరం ఉమైద్ సింగ్ కొందరు అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. నిన్ననే ఈ పీఎస్ నుంచి కొందరు పోలీసులు సస్పెండ్ అయ్యారని.. ఇకనైనా మారండని హెచ్చరించడం విశేషం.
ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. రాజస్థాన్ లో లా అండ్ ఆర్డర్ ఇలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధియే ఇలా చట్టాలు ఉల్లంఘిస్తే ఎలా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.
తాజాగా డీసీపీ జోక్యం చేసుకోవడంతో సీజ్ చేసిన ఎమ్మెల్యే మేనల్లుడి కారును పోలీసులు తిరిగి అప్పగించారు.