తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ - ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన రాజశేఖరరెడ్డి - కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ కు ఎదురుగాలి... టీఆరెస్ అనుకూల గాలిని తట్టుకుని కూడా 21 వేల ఓట్ల భారీ మెజారిటీ సాధించారు.
వెంకటరెడ్డి ప్రస్తుతం తెలంగాణ పీఏసీ ఛైర్మన్ గా ఉన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో వెంకటరెడ్డి ఆ పదవిలోకి వచ్చారు. అంతవరకు పీఏసీ సభ్యుడిగా ఉన్న ఆయన కిష్టారెడ్డి మరణం తరువాత ఛైర్మన్ పదవి చేపట్టారు. కొద్దికాలం కిందట తీవ్ర అస్వస్థతకు లోనయిన ఆయన కిమ్స్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన నేతగా ఉన్న వెంకటరెడ్డి మృతి ఆ పార్టీకి గట్టి దెబ్బగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత ఇమేజితో ఆ జిల్లాలో కొంతవరకు క్యాడర్ ను పట్టి నిలిపి ఉంచిన వెంకటరెడ్డి మృతి పార్టీకి నష్టమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.