ఎంత ప్రజాస్వామ్య పార్టీలని చెప్పుకున్నా... తమ పార్టీల్లో అంతర్గత ప్రాజాస్వామ్యం పుష్కలం అని ప్రకటించుకున్నా ఎవరి లిమిట్స్ లో వారుండాలి అనే విషయంలో ఎవరి ఆలోచన వారిది. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు కాస్త శృతిమించారు. తన రాజకీయ గురువును పొగిడే క్రమంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడినే నోటికొచ్చినట్లు తిట్టారు.. జంతువులతో పోల్చారు. దీంతో పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అధ్యక్ష స్థానంలో ఎవరున్నా - ఆయన చేసిన పనులు తమకు నచ్చకపోయినా నాలుగు గోడల మధ్యా చర్చించుకోవాలి తప్ప ఇలా రోడ్డుకెక్కడం ఏమిటనే ఉద్దేశ్యంతోనో ఏమో కానీ పార్టీకి వ్యతిరేకంగా - రాహుల్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే కారణంలో ఆర్కే రాయ్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
వివరాళ్లోకి వస్తే... చత్తీస్ ఘడ్ లోని గందేర్ దహి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రాయ్.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇటీవలి పరిణామాల్లో అజిత్ జోగిని కాంగ్రెస్ సస్పెండ్ చేయగా చత్తీస్ ఘడ్ జనతా పార్టీ పేరుతో ఆయన సొంత పార్టీ ప్రారంభించుకున్నారు. అలా చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అజిత్ జోగి శిష్యుడే ఈ రాయ్. గతంలో పోలీసు అధికారిగా పనిచేసిన ఆర్కే రాయ్ ను రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించుకున్నది కూడా అజిత్ జోగినే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాయ్ తన రాజకీయ గురువును పొగుడుతూ రాహుల్ గాంధీని గాడిద అని విమర్శించారు.
దీంతో రాయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ... మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీని సమర్థించే క్రమంలో ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారని అందుకే ఆయన్ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు చత్తీస్ ఘడ్ వ్యవహారాల ఇంచార్జీ బీకే హరిప్రసాద్ తెలిపారు. అయితే ఈ పరిణామాన్ని స్వాగతించిన రాయ్, "గాడిదను అలా కాకుండా గుర్రం అని పిలవడం తన వల్ల కాదని.. పార్టీ గురించి తను చేసిన వ్యాఖ్యలు తప్పనిపిస్తే అంతకు మించిన గుడ్డితనం మరోటి ఉండదని.. సస్పెన్సన్ తర్వాతి పరిణామాలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నానని" ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/