తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తే తెలంగాణలో తిరుగులేని శక్తిగా తయారు అవుతామని భావించిన కాంగ్రెస్ పార్టీ కలలు కల్లలు కావటమే కాదు.. తాజా పరిస్థితి చూస్తుంటే.. నాయకులు కూడా మిగిలేలా కనిపించటం లేదు. కిందిస్థాయిలో క్యాడర్ చెల్లాచెదురు అయిపోతుంటే.. నాయకులు ఎవరికి వారు తమ దారి తాము చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటం.. అవి పూర్తి అయిన వెంటనే గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత బలంగా ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే.
ఎవరూ ఊహించని విధంగా గురువారం కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు గులాబీ కండువాలు కప్పేసుకోవటం.. కారులో షికారుకు సిద్ధం కావటం తెలిసిందే. ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఒకరు. పార్టీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అలాంటి ఆయన సైతం.. కష్టకాలంలో పార్టీని వదిలేసి.. భవిష్యత్తును వెతుక్కుంటూ టీఆర్ ఎస్ కు వెళ్లిపోవటం పార్టీ వర్గాలకు పెద్ద షాకేనని చెప్పక తప్పదు. ప్రభాకర్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యవహారమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి సేవకుడినని.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పుకునే దానం నాగేందర్ గులాబీ గూటికి చేరుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభాకర్ ఒకవైపు టీఆర్ ఎస్ లోకి చేరిపోయిన నేపథ్యంలో దానం సంగతేమిటన్న విషయంపై పలు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కారు ఎక్కే దిశగా దానం అడుగులు వేస్తున్నారన్న వార్తలతో పాటు.. సీఎం కేసీఆర్ తో భేటీ అయిన విషయం బయటకు వచ్చింది.
దీంతో.. దానం నోరు విప్పాల్సిన పరిస్థితి. తాను కేసీఆర్ ను కలిసిన మాట వాస్తవమే కానీ.. పార్టీ మారేది లేదని స్పష్టం చేస్తున్నారు. దానంకు పార్టీ మారే ఆలోచన లేకున్నా.. కేసీఆర్ అండ్ కో ఒకసారి మాత్రం ఫిక్స్ అయితే దానం గులాబీ గూటికి వెళ్లక తప్పదన్న మాట వినిపిస్తోంది. రానున్న రెండు వారాల్లో మరిన్ని రాజకీయ సంచలనాలు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.