తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత.. రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్దన్ రెడ్డి ఈ ఉదయం మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం రాజ్యసభ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా సిమ్లా లోని కులుమనాలిలో ఉన్నారు.
ఈ ఉదయం ఆయన గుండెనొప్పికి గురి అయ్యారని తెలుస్తోంది. వైద్య సేవలు అందించినప్పటికీ ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ సమావేశానికి కారులో వెళుతుందగా పాల్వాయ్ కి గుండెనొప్పి వచ్చిందని.. ఆ వెంటనే ఆయన వెనుక సీటులో కుప్పకూలిపోయినట్లుగా చెబుతున్నారు.
ఆయన మరణ వార్త ఇప్పుడు పెద్ద షాకింగ్ గా మారింది. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న ఆయన.. క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోవటం కాంగ్రెస్ పార్టీని.. ఆయన అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తోంది.
పాల్వాయ్ మరణవార్త విన్న వెంటనే.. ఆయన కుటుంబ సభ్యులు కులుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన పాల్వాయ్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయజీవితాన్ని మొదలెట్టి.. అంచలంచెలుగా ఎదిగారు. తాజాగా ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన మరణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి లోటుగా అభివర్ణిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/