కాంగ్రెస్ మ‌రియు క‌మ్యూనిస్టు : కొత్త ఫ్రంట్ ఇలా అయితే మేలు !

Update: 2022-02-19 05:32 GMT
కాంగ్రెస్ పార్టీ ఈ వేళ క‌ష్టాలలో ఉంది.ఈ వేళ‌లో  వేద‌న‌తో  ఉనికి చాటుకునేందుకు వెంప‌ర్లాడుతోంది.ఉన్న సేన‌ల‌కు పోరాట ప‌టిమ లేక,ఉన్నా కూడా స‌ర‌యిన దిశా నిర్దేశం అన్న‌ది లేక నిర్ద‌యామ‌య స్థితిలో ఉంది.ఈ  ద‌శ‌లో కాంగ్రెస్ పార్టీ అనేక అవ‌మానాలు పొందుతోంది.మై ల‌డ్కీ హూ ల‌డ్ స‌క్తీ హూ అంటూ ప్రియాంక గాంధీ (అధినేత్రి సోనియా గాంధీ గారాల‌ప‌ట్టి) ఎంత గ‌ట్టిగా అరిచినా కూడా ఫ‌లితాలు లేవు.

వీటితో పాటు రాహుల్ పుట్టుక‌ను ఉద్దేశించి అస్స‌లు స‌హించ‌లేని భాష‌లో ఆ రోజు అసోం ముఖ్యమంత్రి మాట్లాడినా కూడా స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో మాట్లాడ‌లేక‌పోగా,అస‌లీ విష‌యాన్ని జాతీయ స్థాయిలో నిర‌సన‌ల‌కూ, ధ‌ర్నాల‌కూ అజెండాగా తీసుకువెళ్ల‌లేక,త‌మ గొంతు వినిపించ‌లేక కాంగ్రెస్ చ‌తికిల‌ప‌డిపోయింది.

కాంగ్రెస్ క‌న్నా సంబంధిత స‌మ‌స్య‌పై కేసీఆర్ బాగానే స్పందించారు.జ‌గ‌న్ స్పందించ‌లేదు కానీ  కేసీఆర్ మాత్రం కాస్తో,కూస్తో గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చి బీజేపీ నాయ‌కుల నోళ్లు మూయించారు.ఇదే స‌మ‌యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాస్త సంయ‌మ‌నం కోల్పోయి బీజేపీ నాయ‌కుల‌పై స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో కేసులు న‌మోదు చేయ‌లేని చేత‌గానిత‌నం కేసీఆర్ ది అని నోరు పారేసుకున్నారు.

దీంతో కాంగ్రెస్ ద‌క్కించుకున్న సింప‌తీ అంతా పోగొట్టుకుంది.తెలంగాణ వాకిట కాంగ్రెస్ కు ముఖ్యంగా రెడ్ల నుంచి మంచి మ‌ద్దతు ఉండేది.అందుకే మ‌ళ్లీ ఓ రెడ్డికే పీసీసీ చీఫ్ బాధ్య‌త‌లు ఇచ్చారు అధినేత్రి సోనియా.(ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ) కానీ ఆయ‌న నిల‌బెట్టుకోలేక  కేసీఆర్ కు అనుసంబంధంగానో,చంద్ర‌బాబుకు అనుగుణంగానో ప‌నిచేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు మాత్రం కోకొల్ల‌లు ఉన్నాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టి నుంచో ద‌ళిత ఓటు బ్యాంకు న‌మ్ముకుంది.ఇందిరా గాంధీ హ‌యాం నుంచి అదే హ‌వా కొన‌సాగుతోంది. మైనార్టీలు,క్రీస్టియ‌న్లు, ద‌ళితులు ఈ మూడు వ‌ర్గాలూ సంప‌న్న వ‌ర్గంపై చేసే తిరుగుబాటుకు కాంగ్రెస్ కొంత ఆద‌ర‌వుగా ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాత ఓటు బ్యాంకును ద‌క్కించుకోవ‌డం లేదు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో గ‌తంలో మాదిరిగా తిరుగులేని హవా కాదు కదా 25 సీట్లు కాంగ్రెస్ తెచ్చుకుని అసెంబ్లీలో అడుగుపెడితే చాల‌న్న వాద‌నకు ఇప్పుడు సంబంధిత నాయ‌కులు కూడా మద్ద‌తిస్తున్నారు.ఈ ద‌శ‌లో కొత్త కూట‌మి పేరిట  రాజకీయం న‌డుపుతున్న కేసీఆర్ మాత్రం క‌మ్యూనిస్టుల‌తో పోయేందుకు సిద్ధంగానే ఉన్నారు.కానీ కాంగ్రెస్ తో వెళ్లేందుకు మాత్రం అనుకూలంగా లేరు.అందుకు బెంగాల్ దీదీ మ‌మ‌తా బెన‌ర్జీనే కార‌ణం.
Tags:    

Similar News