హుజూరాబాద్ నుంచి `కాంగ్రెస్‌` ఔట్‌!

Update: 2021-07-26 09:11 GMT
అదేంటి? అనుకుంటున్నారా?  ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజ‌మేన‌ని అంటున్నారు పొలిటిక‌ల్ పండితులు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక రానుంది. ఇక్క‌డ నుంచి వ‌రుస విజయాలు ద‌క్కించుకుని త‌నకంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు పొందిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.. వ‌ర్సెస్ సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య రేగిన వివాదం నేప‌థ్యంలో ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం.. త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీకి కూడా రిజైన్ చేసి.. ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకుని బీజేపీ గూటికి చేరిపోయారు.

ఈ క్ర‌మంలో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. రాష్ట్రంలోని మూడు ప్ర‌ధాన పార్టీలు.. బీజేపీ, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌ల మ‌ధ్య ఈ ఉప ఎన్నిక మ‌రోసారి రాజ‌కీయాల‌ను ర‌గిలిస్తుంద‌ని అనుకున్నా.. అనూహ్యంగా ఈ ప‌రిణామాల్లో కీల‌క‌మైన వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. కాంగ్రెస్ ఇక్క‌డ నుంచి పోటీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి  ప్ర‌ధాన కార‌ణాలతో పాటు సెంటిమెంటు అస్త్రం కూడా క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. హుజూరాబాద్లో సంస్థాగ‌తంగా కాంగ్రెస్ డ‌మ్మీ. ఎందుకంటే.. గ‌డిచిన నాలుగు ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఈట‌ల దిగ్విజ‌యం సాధించారు.

2009, 2010, 2014, 2018 ఎన్నిక్ల‌లో ఈట‌ల తిరుగులేని విజ‌యాన్ని కైవ‌సం చేసుకున్నారు. దీంతో ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ పునాదులు దాదాపు క‌దిలిపోయాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు స‌రైన అభ్య‌ర్థిని ఎంపిక చేసినా.. క్షేత్ర‌స్థాయిలో ఓట్లు రాలే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రొక‌టి.. ఈట‌ల‌పై ఇప్పుడు ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో భారీ ఎత్తున సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయి. దీంతో ఆయ‌న‌ను గ‌తంలో కంటే.. కూడా భారీ మెజారిటీతో గెలిపించిన ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వీటితోపాటు.. కాంగ్రెస్ కు ఇక్క‌డ పోటీ చేయ‌క‌పోవ‌డానికి మ‌రిన్ని కార‌ణాలే క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌... ప్ర‌జ‌ల కోసం కాద‌ని.. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల మాత్రమేన‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ పోటీ చేసి.. ప‌రువు పోగొట్టుకునే క‌న్నా.. గౌర వ‌ప్ర‌దంగా త‌ప్పుకోవ‌డ‌మే మంచిద‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే.. కాంగ్రెస్ నేత‌లు.. అస‌లు హుజూరాబాద్ ఉప పోరుపై అస్స‌లు దృష్టిపెట్ట‌డం లేదు. దీనిని బ‌ట్టి.. కాంగ్రెస్ ఇక్క‌డ నుంచి పోటీ చేసే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. ఇంకో.. కీల‌క‌మైన అంశం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఉప ఎన్నిక‌ల లోపు ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీని వ‌దిలేస్తార‌ని.. కాంగ్రెస్‌లోకి వ‌చ్చేస్తార‌ని.. ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మనార్హం. సో.. ఇది కూడా కాంగ్రెస్ పోటీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. 
Tags:    

Similar News