కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని అక్కడి నుంచి ప్రారంభించేసింది. ఇక జోగులాంబ గద్వాల సన్నిధి నుంచి కాంగ్రెస్ కూడా అదే జిల్లా నుంచి ప్రచార పర్వంలోకి దూసుకెళ్లింది. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చొచ్చింది. ఇక్కడి నుంచి ప్రచారం చేసిన ప్రతీసారి గెలిచిందట.. అందుకే సెంటిమెంట్ ను మరోసారి పునరావృతం చేసింది.
రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో పాలమూరు - నల్గొండ జిల్లాలపైనే కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఉత్తర తెలంగాణలో టీఆర్ ఎస్ బలంగా ఉండడంతో అధిక సీట్లు పాలమూరు - నల్గొండలల్లో సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ రెండు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అంతేకాదు సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ - చిన్నారెడ్డి - నాగం జనార్ధన్ రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి - సీనియర్ నేత జైపాల్ రెడ్డి కూడా పాలమూరు జిల్లా వాసులే..
గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కారు హవా నడిచినా పాలమూరులో కాంగ్రెస్ ఎదురొడ్డి 5 సీట్లు సాధించింది. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 10 -11 తేదీల్లో ఏకంగా 9 నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు విస్తృత ప్రచారానికి తెరతీసింది. వనపర్తి సీటుపై మహాకూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ సీటు కోరుతున్నారు. దీంతో ఇక్కడ ప్రచారానికి కాంగ్రెస్ దూరమైంది. మరి ఈ పాలమూరు నుంచే మొదలెడుతున్న ప్రచారం కాంగ్రెస్ కు కలిసివస్తుందా లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది.