బీజేపీని కాంగ్రెస్ గెలిపిస్తుందా?

Update: 2020-01-20 05:29 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగానే బ‌రిలోకి దిగుతూ ఉంది. ఐదు సంవ‌త్స‌రాల కింద‌ట జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌నీసం ఒక్క సీటును కూడా నెగ్గ‌లేక‌పోయింది. ఆప్ ప్ర‌భంజ‌నంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. బీజేపీ అయినా మూడు అసెంబ్లీ సీట్ల‌ను సాధించుకుంది కానీ, కాంగ్రెస్ మాత్రం ఖాతా తెర‌వ‌లేక‌పోయింది.

గ‌త ఐదేళ్ల‌లో కాంగ్రెస్ రాజ‌కీయంగా మ‌రింత ఇబ్బందిక‌ర‌మైన స్థితిలోకి ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ కి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు క‌ఠిన ప‌రీక్ష‌గా మారాయి. ఒక‌ప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ తిరుగులేని రీతిలో అధికారాన్ని చ‌లాయించింది. 15 సంవ‌త్స‌రాల పాటు ఏక‌ధాటిగా ఏలింది. అలాంటి చోట ఒక్క సీటును కూడా నెగ్గ‌లేక‌పోయింది. ఐదేళ్ల త‌ర్వాత అయినా ఇప్పుడు కాంగ్రెస్ త‌న స‌త్తాను ఏ మేర‌కు చూపుతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంది. నాలుగు సీట్ల‌ను ఆ పార్టీకి ఇచ్చి బ‌రిలోకి దిగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మ‌ళ్లీ అధికారం సాధించుకోవ‌డం మాటేమిటో కానీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం దెబ్బ వేసే అవ‌కాశాలున్నాయి. కాంగ్రెస్ ను చిత్తు చేస్తూ ఆప్ ఢిల్లీలో సెటిలైంది. కాంగ్రెస్-ఆప్ ల ఓటు బ్యాంకు ఒక‌టే. బీజేపీ వ్య‌తిరేక ఓటునే ఈ పార్టీలు సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు త్రిముఖ‌ పోరు జ‌రుగుతూ ఉంది.

 పొత్తు ప్ర‌తిపాద‌న వ‌చ్చినా.. ఈ రెండు పార్టీలూ అందుకు ముందుకు రాలేదు. సోలోగా పోటీ చేయ‌డానికే రెడీ అయ్యాయి. ఆ మేర‌కు అభ్య‌ర్థుల‌ను అనౌన్స్ చేశాయి. అభ్య‌ర్థుల‌ను దాదాపుగా ఖ‌రారు చేశాయి. కాంగ్రెస్ ఐదేళ్ల కింద‌ట చాలా త‌క్కువ శాతం ఓట్ల‌ను పొందింది. ఆప్ అప్పుడు ప్ర‌భంజ‌నాన్ని రేపింది. ఒక‌వేళ ఆప్ ఓటు బ్యాంకును చీల్చుకుంటే మాత్రం బీజేపీకి చాలా సాయం చేసిన‌ట్టుగా అవుతుంది.


Tags:    

Similar News