ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా సాధించకపోయినా ఏదో ఒక యాక్టివిటీ చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గడం లేదు. ముఖ్యంగా ఆ పార్టీకి ఏకైక దిక్కుగా మారిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కమిట్ మెంట్ వల్లే ఆ పార్టీ ఇంకా ఏపీలో ఉందన్న సంగతి ప్రజలకు తెలుస్తోంది. లేదంటే ఇప్పటికే జనం దానికి తిలోదకాలిచ్చేసేవారు. ఎవరు తనతో కలిసి వచ్చినా రాకున్నా కూడా నిత్యం ఏదో ఒక యాక్టివిటీతో కాంగ్రెస్ పార్టీ పేరు జనానికి వినిపించేలా చేస్తున్నారు రఘువీరా.
తాజాగా ఆయన మాజీ కేంద్ర మంత్రులు - సీనియర్ నేతలను పోగేసి తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఖాళీ బిందెలతో ప్రదర్శన జరిపారు. తెలంగాణ రాష్ట్రం పైన గోదావరి - కృష్ణా నదులపై అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తే ఏపీ పరిస్థితి ఎడారేనని.. చుక్క నీరు కూడా దక్కదని చెబుతూ సింబాలిక్ గా ఖాళీ బిందెలతో కదం తొక్కారు. విజయవాడ కేంద్రంగా నిరసన ప్రదర్శన జరపడం.. పార్టీ సీనియర్ నేతలు - మాజీ మంత్రులు పల్లంరాజు - కృపారాణి తో పాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు - విజయవాడకు చెందిన నేత దేవినేని నెహ్రూ వంటివారు ఈ నిరసనలో పాలుపంచుకోవడంతో జనం బాగానే కనిపించారు.
నిరసన సందర్భంగా నేతలు తెలంగాణ ప్రభుత్వంపైనా... ఆ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నా పట్టించుకోకుండా మౌనం దాల్చుతున్న చంద్రబాబుపైనా విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలు - రైతులు తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులతో తీవ్రంగా నష్టపోతారని నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ ప్రాజెక్టులను ఆపేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో చేపట్టిన ఏ కార్యక్రమానికీ కనిపించనంత ఆదరణ కనిపించడంతో కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది.