వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. బరిలో దిగిన పార్టీలు తమ శక్తియుక్తుల మేరకు ప్రచారపర్వంలో ముందుకు కదిలాయి. అధికార టీఆర్ఎస్ గెలుపుపై ధీమాగా ఉండి మెజార్టీపై సమాలోచనలు చేస్తోంది. ప్రతిపక్ష ఎన్డీఏ - కాంగ్రెస్ లు ఎలాగైన గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాయి. అయితే సత్తాను తేల్చుకునేందుకు పోరులో నిల్చిన వైసీపీ అధినేత జగన్ ప్రచార శైలి ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ జగన్ వరంగల్ ప్రచారంలో భాగంగా 3 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ మూడు రోజలు జగన్ ఓరుగల్లులోనే మకాం వేశారు. ఓరుగల్లులో ప్రచారంలో అడుగు పెట్టిన జగన్ కు టీడీపీ-బీజేపీ - కాంగ్రెస్ ప్రచారం సమయంలో వచ్చిన స్థాయికి సమానంగా ప్రజలు హాజరవుతున్నారు. జగన్ రోడ్ షోలు - సభలకు ప్రజలు అనూహ్యంగా తరలుతుండటం, వైఎస్ పై ఉన్న అభిమానం వైసీపీకి ఓట్లుగా మారే అవకాశం కనిపిస్తుండటటంతో ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న బెంగ కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేసుకోగా, జగన్ సభలకు జనం రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న ఎస్సీ - క్రిస్టియన్ - మైనార్టీ వర్గాలు వైఎస్ పై అభిమానంతో వైస్సార్ సీపీ పట్ల ఆకర్శితులయ్యే అవకాశముండటంతో ఫలితాల్లో కాంగ్రెస్ కు ఝలక్ తగలనుందా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ ఇచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయిన తెలంగాణ కాంగ్రెస్.. ఆ తర్వాత జరిగి మెదక్ పార్లమెంటు ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలోనూ అదే రీతిలో పేలవ ప్రదర్శనలో కనబరిచి పార్టీ అదిష్టానం చేతిలో ఆగ్రహానికి గురైంది. తాజాగా వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక మరో అగ్నిపరీక్షగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.