తెలంగాణ ఎన్నికల్లో పలువురు నేతలు మండలి నుంచి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల రూపంలో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలని తహతహలాడుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా ముగ్గురు ఎమ్మెల్సీలు ఇలా అసెంబ్లీ టిక్కెట్లకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే... ఇప్పటికే టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో ఎమ్మెల్సీలు కూడా ఇలా పోటీ పడుతుండడంతో పలువురు ఆశావహులు అధిష్ఠానం వద్ద తమ అభ్యంతరాలు తెలిపినట్లు చెబుతున్నారు.
కామారెడ్డి సెగ్మెంట్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ షబ్బీర్ అలీ శాసన మండలి విపక్ష నేతగా కొనసాగుతున్న విషయం విదితమే. అయితే, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన సొంత సెగ్మెంట్ నుండి బరిలోకి దిగేందుకు సర్వం సిద్ధం చేసుకుని తెరాసకు దీటుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరిగా చెలామణి అవుతున్న మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే షబ్బీర్ అలీకి టిక్కెట్ ను ఖరారు చేసిందని - అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయిగా మారిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయనకు మద్దతుగా కామారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనడం - టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికి హాజరై షబ్బీర్ ను గెలిపిస్తే కీలక పదవి చేపడతారని ఓటర్లను కోరడం ఆయనకు దాదాపుగా అభ్యర్థిత్వం ఖరారైందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఆర్మూర్ నుండి మరో ఎమ్మెల్సీ ఆకుల లలిత టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఆమె పేరును అధిష్ఠానం ప్రకటించక మునుపే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. టీ.పీసీసీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మీదటే ప్రచారాన్ని ప్రారంభించినట్టు ఆకుల లలిత వర్గీయులు పేర్కొంటున్నప్పటికీ - ఈ విషయంలో షబ్బీర్ అలీ తరహాలో ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు మాత్రం వెలువడలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధం చేసిన తొలి జాబితాలోనూ ఆమె పేరు లేకపోవడం ఆకుల లలిత వర్గీయులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది.
మరోవైపు తెరాస అసమ్మతి నేతగా ముద్రపడి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి టిక్కెట్ కోసం గట్టిగానే తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అభ్యర్థిత్వం కేటాయిస్తారనే హామీ మేరకే ఆయన కాంగ్రెస్ లో చేరినట్టు ప్రచారం జరిగింది. అయితే నిజామాబాద్ రూరల్ స్థానాన్ని మహాకూటమిలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని నిర్ణయించిన దరిమిలా - ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ప్రయత్నాలకు ఏమేరకు ఫలిస్తాయన్నది చూడాలి.