అధికార టీఆర్ ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి పేరుతో పొత్తు కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పొత్తు పెట్టుకున్న పలు పార్టీలు కాంగ్రెస్ తీరుపై దుమ్మెత్తి పోస్తుండగా...టికెట్ల పంపకంపై మండిపడుతుండగా...అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యాక కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు - మాజీ మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకరు అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరుతుండగా మరొకరు జాతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ వైపు మొగ్గుచూపుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముత్యం రెడ్డి గుడ్ బై చెప్పేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక టికెట్ ను కూటమిలో భాగంగా టీజేఎస్ కు కేటాయించారు. దీంతో ఆయన తీవ్రంగా కలతచెందారు. తొమ్మిదేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవచేసినా గుర్తింపు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావు - దుబ్బాక టీఆర్ ఎస్ అభ్యర్థి సోలిపేట రాంలింగారెడ్డి సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి స్వగృహానికి ఆదివారం వెళ్లి టీఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తో తనకు పదేండ్ల ఆత్మీయ అనుబంధం ఉన్నదని - ఎప్పుడు కలిసినా ముత్తన్న అని అత్మీయంగా పలుకరిస్తారని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈనెల 20న సిద్దిపేట సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరుతున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ లో పైసలున్నోళ్లకే టికెట్లు ఇస్తున్నారు..పార్టీ కోసం కష్టించి పనిచేసినా గుర్తింపు ఇవ్వలేదు..మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో సేవ చేశాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధోకా చేసింది అంటూ ముత్యంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గంలో పనిచేస్తుండగా, తనకు పోటీగా మరో నాయకుడిని తయారు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తన దగ్గర పైసలు లేవని - కుంభ కోణాలు చేసిన వారికే టికెట్లు దక్కుతున్నాయన్నారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ పి. శంకర్ రావు ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. శంకర్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లో సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు పోటీ చేసిన తాను నాలుగుసార్లు గెలిచానని గుర్తు చేశారు. తాను టికెట్ ఆశించడంలో న్యా యం ఉందన్నారు. డబ్బులకు అమ్ముడుపోయి సీట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు స్పష్టం చేశారు. తనకు టికెట్ రాకుండా కాంగ్రెస్ జిల్లా నాయకులు అడ్డుకున్నారని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బిల్యానాయక్ ఆరోపించారు. నల్లగొండ దేవరకొండ పట్టణకేంద్రంలో బిల్యా నాయక్ వర్గీయులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి ఉత్తమ్ కుమార్ రెడ్డి - జానారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తల నిర్ణయం మేరకు సోమవారం నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు.
ఇదిలాఉండగా పీసీసీ సభ్యుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ లో చేరారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ సభ్యుడు ఏనుగు మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 25 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నానని, టికెట్ ఇస్తామని చెప్పి అధిష్టానం తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తన కార్యకర్తలతో హైదరాబాద్ కు వెళ్లి కేటీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు.