ఒవైసీ వీరంగమంతా బూటకమంటున్న కాంగ్రెస్

Update: 2016-01-08 10:09 GMT
ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బెదిరిస్తూ ఐఎస్ ఉగ్రవాదులు ట్వీట్లు చేయడం... దానికి ఎంపీ స్ట్రాంగ్ రిప్లయ్ ఇవ్వడం తెలిసిందే. ఐసిన్ ను ఒక హిందుస్థానీగా తాను ఎదిరిస్తానని చెప్పి అందరి మనసులు దోచుకున్న అసదుద్దీన్ ఒవైసీపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తంచేస్తోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ హడావుడంతా చేస్తున్నారని.... అసలు ఆ ట్వీట్లు ఐఎస్ ఉగ్రవాదులు చేసినవేనా లేదంటే సీను క్రియేట్ చేయడం కోసం అసద్ చేయించినవా అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
    
అసలు ఆయన్ను బెదిరిస్తూ ఐఎస్ ఏమీ ట్వీటు చేయలేదని... ఐఎస్ ఉగ్రవాదులు భార‌త్ పై దాడి చేస్తారంటూ ఎవరో అనామకుడు ఒకరు ఆయనకు  ట్వీట్ చేయడంతో దాన్ని ఇలా తిప్పారని అంటున్నారు. ఆ ట్వీటు రాగానే అసద్ ప్రెస్ మీట్ పెట్టి ఐఎస్ పై విరుచుకుపడ్డారు. ఐసిస్ ఇస్లాం కు వ్యతిరేకమని... అదొక సైతాన్ అని... ఐఎస్ పై తాను ఇండియన్ లా పోరాడుతానని చెప్పి ఉద్వేగాలకు తెరతీశారు. దీనిపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తంచేస్తోందట. ఐఎస్ హెచ్చరిక ఉత్తిదే అని, ఓట్ల కోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయ‌డం అస‌ద్ కు అలవాటేనని అంటున్నారు. తమతో పొత్తు పెట్టుకున్నప్పుడు గతంలోనూ ఇలానే చేశారని... తాము ఆయన్ను నమ్మబోమని అంటున్నారు.
Tags:    

Similar News