తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఎన్నికల కమిషన్ ..నోటిఫికేషన్ విడుదల చేయకపోయినప్పటికీ....పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీగా ఉన్నాయి. అధికార టీఆర్ ఎస్ ను ఓడించేందుకు మహాకూటమిని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. టీడీపీ - జనసమితి - సీపీఐలతో కలిసి కాంగ్రెస్ ....మహాకూటమిగా ఏర్పటి ...టీఆర్ ఎస్ ను దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఆ కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న అంశం తెరపైకి వచ్చింది. ఆ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఆర్ సీ కుంతియా స్పష్టత నిచ్చారు. పార్టీకి...అభ్యర్థికి ఉన్న బలాబలాలను బట్టి నియోజకవర్గాలు - సీట్ల కేటాయింపులు జరుగుతాయని కుంతియా అన్నారు. ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత వస్తుందని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ....సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. సీట్ల పంపకాలు ఇంకా జరగలేదని - మూకుమ్మడిగా మహాకూటమిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయని అన్నారు. అన్ని పార్టీలు కలిసి ప్రచారం నిర్వహించేందుకు కూడా చర్చలు జరిగాయని అన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థులకు బలముందో ...దానిని బట్టి..సీట్ల పంపకం ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ ఎస్ ఓటమి ఖాయమని - మహా కూటమికి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.