తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ బాహుబలిని ప్రచారం రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ లోనే ఆయన రాజకీయ భవిష్యత్ ఎదిగింది. ఆయనకు అన్నీ ఇచ్చిన కాంగ్రెస్ కోసం ఈ ఒక్కసారి ప్రచారం చేయించాలని టీపీసీసీ పెద్దలు పట్టుదలగా ఉన్నారు. మరి ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుదామని వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి. కానీ కాలం కలిసిరాక రాజకీయాల్లో రాణించలేకపోయారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రి పదవి అధిష్టించారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆయన జీవితానికి ఒక రాజకీయ హోదాను కట్టబెట్టింది. ఆ సింఫథీని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యుపకారాన్ని ఆశించాలని చూస్తోంది.
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చిరంజీవితో ప్రచారం చేయించడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ చిరంజీవి మాత్రం రాజకీయాలంటే ఆసక్తి చూపించడం లేదట.. ‘సైరా’ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. రాజకీయాల కాడి వదిలేసి బుద్దిగా సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడట.. అన్నయ్య చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రాడంటూ పవన్ కూడా పలుమార్లు తేల్చిచెప్పారు.
చిరంజీవి అనాసక్తి దృష్ట్యా కాంగ్రెస్ నేతలు రాహుల్ ద్వారా నరుక్కురావడానికి ప్రయత్నిస్తున్నారట.. ఏకంగా రాహుల్ గాంధీతో చిరంజీవికి చెప్పించి తెలంగాణ ఎన్నికల ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తున్నారట.. మరి రాహుల్ చెప్పాక అయినా చిరంజీవి మనసు మార్చుకొని ఎన్నికల ప్రచారానికి వస్తాడా అన్నది వేచిచూడాలి..