రాత్రి కి రాత్రి మహా రాజకీయం పూర్తిగా మారి పోయింది. రోజు రోజుకో మలుపు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయానికి బీజేపీ అంతిమ గీతం పాడింది. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అందరూ అనుకుంటున్న తరుణంలో దానికి భిన్నంగా.. ఎవరూ ఊహంచని విధంగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ కోశ్యారీ సాక్షి గా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి.. ఎన్‌సీపీ మద్ధతు ప్రకటించడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయి... ఫడ్నవిస్ మహారాష్ట్రకు రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గురించి అంతా చర్చించుకుంటున్నారు!
అక్టోబర్ 21వ తేదీన జరిగిన ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్నాయి. నిజానికి బీజేపీ-శివసేన కూటమి మ్యాజిక్ మార్క్‌ను దాటింది. కానీ సీఎం పదవి విషయంలో ఆ రెండు పార్టీల మధ్య విబేధాలు వచ్చాయి. సీఎం పదవిని పంచుకోవాలని శివసేన పట్టుపట్టింది. కానీ బీజేపీ ఆ షరతు కు అంగీకరించ లేదు. దీంతో మహారాష్ట్ర లో ప్రతిష్టంభన నెలకొంది. ఫలితాలు వచ్చి రెండు వారాలు దాటినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మరో వైపు ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన అనేక ఎత్తుగడలు వేసింది. తమ డిమాండ్లకు బీజేపీ ఎంతకీ అంగీకరించకపోవడంతో.. ఇతర పార్టీలతో జత కట్టేందుకు ఉవ్విళ్లు ఊరింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో బిజీబిజీగా గడిపారు. వికాశ్ కూటమి పేరుతో ఉద్దవ్‌ను సీఎంగా చేస్తున్నట్లు కూడా శుక్రవారమే ప్రకటించారు. ఆ తర్వాతే, రాత్రికి రాత్రే సీన్ మారింది. ఫడ్నవీస్ సీఎంగా అయ్యారు.
అయితే, శివసేన-ఎన్‌సీపీ- కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు కోసం శరద్ పవార్ ద్వారా సేన లాబీయింగ్ నిర్వహించింది. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, శరద్ పవార్ చర్చలు జరిపారు కూడా.శివసేన కు సీఎంతోపాటు 16 పదవులు, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 పదవులు, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విధంగా డీల్ కుదిరింది. అయితే, ఈ పరిణామం చర్చల తోనే సరి పోయింది. ఆ మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. సోనియాకు షాకిస్తూ...బీజేపీ-ఎన్‌సీపీ సర్కారును ఏర్పాటు చేశాయి. ఇది సోనియా వైఫల్యమా? బీజేపీ చాణక్యమా? ఇంతకీ...కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.