అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన వేళలో.. శతాధిక వృద్ధ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన అధినేత రాహుల్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. భారీ ట్రోలింగ్ కు కారణంగా మారాయి. అసలే కాంగ్రెస్.. అందునా రాహుల్ లాంటి అధినేతతో కిందామీదా పడుతున్న పార్టీకి తగ్గట్లే.. ఆ పార్టీ సోషల్ మీడియాను హ్యాండిల్ చేసే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో కానీ.. మోడీషాలకు లడ్డూలాంటి ఫోటోల్ని తన చేతులతో తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ ఫోటోలేంది?. దానితో ఎంత రచ్చ జరిగిందన్నది చూస్తే..
ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన జర్మనీ పార్లమెంటును సందర్శించారు. అక్కడి మీడియాతోనూ మాట్లాడారు. వివిధ వర్గాలతో మాట్లాడారు . ఇలాంటి వేళ.. రాహుల్ ఇమేజ్ ను మరింత పెంచేలా ప్రయత్నం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అందుకు భిన్నంగా జర్మనీ పార్లమెంటు దగ్గర రాహుల్ కు చెందిన కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది.
ఇందులో నిర్వికారంగా ఉన్న రాహుల్ తో పాటు.. మరిన్ని చిత్రమైన యాంగిల్స్ ఫోటోల్ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో రాహుల్ చిత్రమైన ముఖ కవళికలతో ఉన్నాయి. చూసినంతనే ఎటకారం ఆడుకునేలా ఉన్న ఫోటోల్ని కాంగ్రెస్సే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయటంతో బీజేపీకి ఇదో ఆయుధంగా మారింది.
వెంటనే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ ఫోటల్ని షేర్ చేసి.. వాటిని రిట్వీట్ చేయకుండా ఉండలేకపోయామన్న మాటను చెప్పేసింది. బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. రాహుల్ ఫోటోలు.. అందునా చిత్రంగా ఉన్న ఆయన ముఖ కవళికల ఫోటోలు పోస్టు చేసిన వెంటనే కమలదళం చెలరేగిపోయింది. రాహుల్ ఫోటోలపై ట్రోలింగ్ షురూ చేసింది. దీనికి మరికొందరు తోడయ్యారు.
రాహుల్ నెక్ట్స్ ఎక్స్ ప్రెషన్ అని ఒకరు.. మీ విజన్ ఏమిటి అని అడిగితే రాహుల్ దిక్కులు చూస్తున్నారని మరొకరు.. ఇలా ఎవరికి వారు తమకు తోచిన వ్యాఖ్యలు చేయటం మొదలెట్టారు. ఏదో ఇమేజ్ వస్తుందని కాంగ్రెస్ పెట్టిన పోస్టుకు ఈ తరహా ట్రోలింగ్ ను ఊహించని కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. అధినేత ఫోటోల్ని పోస్టు చేసేటప్పుడు.. వాటిని తామెందుకు పెడుతున్నాం? వాటి కారణంగా పార్టీకి.. అధినేతకు కలిగే ప్రయోజనం ఏమిటన్న లెక్కలు చూడకుండా పెట్టేసిన తీరు ప్రత్యర్థులకు పండగ చేసుకునేలా చేసిందని చెప్పాలి. ఈ ఎపిసోడ్ చూసిన మరికొందరు.. ఈ కాంగ్రెస్సోళ్లకు ఏమైంది.. చేజేతులారా అధినేత పరువును తీస్తున్నారే అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.