కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు..' చిరు' సంద‌డేది బాస్‌!!

Update: 2022-10-17 14:56 GMT
దేశంలో 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. హస్తం పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌... అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబం కాకుండా ఇతర వ్యక్తి ఏఐసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో... వేలాది మంది ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 3గంటల సమయానికి 71శాతం పోలింగ్ నమోదైందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సోనియా, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఓటేశారు. 9900 మంది ఓటర్లకు గాను 9500 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. 96 శాతం ఓటింగ్ పోలైనట్లు ఆయన చెప్పారు. బుధ‌వారం ఎన్నిక‌ల ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌నున్న‌ట్టు చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి.. కీల‌కమైన నాయ‌కులు  కూడా ఓటేశారు. ఏపీలో పార్టీకి కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ.. అస‌లు ఏపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని సైతం వ‌దులుకున్న ర‌ఘువీరారెడ్డి సైతం.. వ‌చ్చి ఓటేశారు.

ఇక‌, ఇత‌ర నేత‌లు కూడా.. ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అయితే.. తెలంగాణ‌లో ఉంటున్న వారిలో కొంద‌రు మాత్రంఓటుకు దూరంగా ఉన్నార‌ని తెలుస్తోంది.వీరిలో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పేరు చిరంజీవి. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. కేంద్రంలో మంత్రిగా చ‌క్రం తిప్పిన చిరు.. విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే.. త‌ర్వాత కొన్నాళ్ల‌కు ఆయ‌న మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి పెట్టారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నాన‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. రాజ‌కీయంగా ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా.. ఆయ‌న ఎక్క‌డా ఎవ‌రి గురించి రియాక్ట్ కావ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌కు 'డెలిగేష‌న్‌' హోదా ఇస్తూ.. ఐడెంటిటీ కార్డు కూడా పంపించింది. దీంతో ఆయ‌న ను కాంగ్రెస్‌లో కొన‌సాగిస్తున్నార‌ని.. ఆయ‌న కాంగ్రెస్ కుటుంబ స‌భ్యుడ‌ని ఆ పార్టీ వారు చెప్పుకొచ్చారు.

ఇంత వ‌ర‌కు ఎలా ఉన్నా.. తాజాగా జ‌రిగిన కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో చిరు ఓటేయ‌లేదు. ఆయ‌న‌కు డెలిగేష‌న్ ప్ర‌కారం.. ఓటు హ‌క్కు ఉంది. అయినా కూడా.. ఆయ‌న ఓటేయ‌క‌పోవ‌డం..క‌నీసం ఆ ఊసు కూడా ఎత్త‌క‌పోవ‌డంతో ఆయ‌న పార్టీకి దూర‌మ‌య్యారా?  కాంగ్రెస్ కావాల‌నే ఆయ‌న‌ను రాసుకుని పూసుకుని తిరుగుతోందా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News