మోడీని నీచుడ‌ని విమ‌ర్శించిన నేతకు సర్ ప్రైజ్

Update: 2018-08-19 04:32 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నీచుడ‌ని కామెంట్లు చేసిన వ్య‌క్తి విష‌యంలో కాంగ్రెస్ పార్టీ మ‌న‌సు మార్చుకుంది. కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్‌ పై విధించిన సస్పెన్షన్‌ ను ఎత్తివేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ తెలిపారు. తొమ్మిది నెలల క్రితం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు మణిశంకర్ అయ్యర్‌ ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. తాజాగా మణిశంకర్ అయ్యర్‌ పై విధించిన సస్పెన్షన్‌ ను ఎత్తివేయాలని ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ చేసిన సిఫారసును రాహుల్‌ గాంధీ ఆమోదించారని అశోక్ గెహ్లాట్ తెలిపారు.

అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగంపై మణిశంకర్ అయ్యర్ స్పందిస్తూ నీచ్ కిస్మ్ కా ఆద్మీ అని చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. మోడీ నీచమైన మనిషి అని అయ్యర్ వ్యాఖ్యానించగా దీనిపై ప్రధాని మోడీ ప్రతిస్పందిస్తూ ``ఈ వ్యాఖ్యలు గుజరాత్‌ ను అవమానించడమే. కాంగ్రెస్ మొఘల్ మైండ్‌ సెట్ అని మరోసారి రుజువైంది`` అని వ్యాఖ్యానించారు. గుజరాత్ తొలిదశ ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్నిగంటల ముందు అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు దిగింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సూచనతో తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మణిశంకర్ అయ్యర్.. క్షమాపణలు తెలిపారు. మరోవైపు అయ్యర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించేందుకు ప్రధాని - బీజేపీ రోత వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి భిన్నమైన సంస్కృతి ఉంది అని రాహుల్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికతో కూడిన సంకేతమిచ్చేందుకు ఏ హోదా లేకున్నా అయ్యర్‌ ను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అయ్యర్ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జోక్యం చేసుకుని ప్రధానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా అయ్యర్‌ కు సూచించారు. కాంగ్రెస్ పార్టీపై దాడి చేసేందుకు ప్రధాని - బీజేపీ పార్టీ ఎన్నో పరుష పదాలు వాడుతుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందుకు భిన్నం. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. వెంటనే మోడీకి క్షమాపణలు చెప్తారని ఆశిస్తున్నా అని రాహుల్ ట్వీట్ చేశారు. అయితే తాను హిందీలో వక్తను కానని, భాషపై పూర్తిగా పట్టులేక అలాంటి పదాలు వాడాల్సి వచ్చిందని అయ్యర్ వివరణ ఇచ్చారు. నేను ఆయన మనస్తత్వం గురించే అలా అన్నానుకానీ, తక్కువ జాతి అన్న అర్థంలో పదాన్ని వాడలేదు. నా వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి అని మణిశంకర్ అయ్యర్ కోరారు. అయినప్పటికీ మణిశంకర్ వ్యాఖ్యల దుమారం సద్దుమణగకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా ఆ స‌స్పెన్ష‌న్ ఎత్తివేశారు.
Tags:    

Similar News