తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల పరంపర కొనసాగుతూ ఉంది. ఒకవైపు నేతలు - సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్లిపోతూ ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పరంపర కొనసాగుతూ ఉంది. వాటిని ఎలా ఆపాలనేది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అంతుబట్టని అంశం అయిపోయింది. అధిష్టానం కూడా ఆ విషయంలో ఏం చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి.
తెరాస వైపు వెళ్లే వలసల సంగతలా ఉంటే.. మరోవైపు బీజేపీలోకి కూడా వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పాలమూరు జేజెమ్మ డీకే అరుణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరిపోయారు. బీజేపీ తరఫున ఆమె టక్కున ఎంపీ టికెట్ కూడా సొంతం చేసేసుకున్నారు. ఆమె దెబ్బకు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ సీట్లో మూడో స్థానానికి పరిమితం అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. అలా అనూహ్యంగా బీజేపీ లోకి ఒక ముఖ్య నేత వెళ్లిపోవడం కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ అయ్యింది.
కేవలం ఆమె మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు మరో సీనియర్ నేత కాంగ్రెస్ కు రాజీనామా విషయాన్ని ప్రకటించారు. ఆయనే పొంగులేటి సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ ఎమ్మెల్సీ ఢిల్లీ బయల్దేరినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఈయన ప్రధాని మోడీ తో సమావేశం అయ్యి.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తీరుతో విసిగిపోయి రాజీనామా చేస్తున్నట్టుగా పొంగులేటి ప్రకటించారు. టికెట్ల కేటాయింపు విధానం కూడా సరిగా లేదని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి బీజేపీలోకి చేరబోతున్నారని తెలుస్తోంది. పొంగులేటి ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపించకపోయినా.. కాంగ్రెస్ తరఫున గట్టిగా వాయిస్ ను వినిపిస్తూ వచ్చారు.