సుమలతపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

Update: 2019-02-26 06:01 GMT
కర్ణాటక రెబల్ స్టార్, మాజీ మంత్రి అంబరీష్ చనిపోవడంతో ఇప్పుడు ఆయన భార్య, ప్రముఖ నటి సుమలత రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. కర్ణాటకలోని అంబరీష్ స్వస్థలమైన మాండ్య నుంచి లోక్ సభకు పోటీచేస్తానని ఆమె ప్రకటించారు. అయితే దీనిపై కాంగ్రెస్ తాజాగా సుమలతతో చర్చలు మొదలు పెట్టింది. ట్రబుల్ షూటర్, కర్ణాటక మంత్రి డీ శివకుమార్ ఈ మేరకు ఆమెతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి డీకే శివకుమార్ మాండ్య లోక్ సభ నియోజకవర్గ నుంచి ఎవరూ పోటీచేయాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్చ చేస్తోందని తెలిపారు. గత లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నుంచి జేడీఎస్ అభ్యర్థి ఎంపీ అయ్యారని.. ఈ విషయంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మాండ్యను జేడీఎస్ కు ఇచ్చిందని కానీ సుమలత మాత్రం దీన్ని వ్యతిరేకించిందన్నారు.

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని సుమలత ప్రకటించడంతో డీకే శివకుమార్ ఆమెతో చర్చలకు దిగారు. ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి డీకే తెలిపారు.

మంత్రి డీకే శివకుమార్.. దివంగత మంత్రి అంబరీష్ కు అత్యంత సన్నిహితుడు. సుమలత మనసు మార్చడానికి డీకే ను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆమెతో చర్చలు జరిపి సీటు మార్పించడానికి ప్రయత్నాలను కాంగ్రెస్ చేస్తోంది. దీనిపై సుమలత ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News