కాంగ్రెస్ ఖాళీ సభను ఫొటో తీశాడని చితకబాదారు..

Update: 2019-04-07 11:06 GMT
మొగుడు కొట్టినందుకు కాదు.. తోటి కోడలు ఏడ్చినందుకు నవ్విందట వెనుకటికి ఒక ఇల్లాలు.. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది.. ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలే తమిళనాట అయితే అన్నాడీఎంకే.. లేదంటే డీఎంకేకే ప్రజలు పట్టం కడుతారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు తమిళనాడులో చోటు లేదు. అయినా ఉనికి చాటుకేందుకు ఆయా పార్టీలు ప్రచారానికి దిగుతూనే ఉన్నాయి.

ఈ కోవలోనే తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచారసభ జరిగింది.  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సభకు జనాలు పెద్దగా రాలేదు. దీంతో ఈ ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చిన తమిళ్ వీక్లీ మ్యాగజైన్ కు చెందిన జర్నలిస్టు ముత్తురాజ్ కుర్చీలు ఖాళీగా ఉండడంతో ఫొటోలు తీశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు గొడవపడి జర్నలిస్టుపై దాడికి దిగారు. చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జర్నలిస్టును ఆస్పత్రికి తరలించారు.

ఇక జర్నలిస్టుపై దాడిని తోటి పాత్రికేయులు అడ్డుకున్నారు. దీంతో జర్నలిస్టులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట జరిగింది. పలువురు పాత్రికేయులకు గాయాలయ్యాయి. ఈ సభకు తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్ కేఎస్ అళగిరి హాజరు కావాల్సి ఉన్నా జనాలు లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు గుండాల్లో ప్రవర్తించారని మండిపడ్డారు.
    
Click For Video
Tags:    

Similar News