2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతున్న మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైంది. నాడు ఇది ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా ఆ మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పైలెట్లే ఉద్దేశ్యపూర్వకంగా కూల్చి వేశారనే అనుమానాలు వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఎంహెచ్ 370 విమానానికి సంబంధించిన శకలాల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలించినా నాడు ఫలితం లేకుండా పోయింది. అయితే 2017లో తుఫాను ధాటికి బోయింగ్ 777 తరగతికి చెందిన విమానం చక్రాల భాగానికి సంబంధించిన తలుపు సముద్ర తీరానికి కొట్టుకొని వచ్చింది. దీని గురించి తెలియని ఓ మత్స్యకారుడు దానిని తన ఇంట్లోనే ఐదేళ్లపాటు ఉంచుకున్నాడు. అతడి భార్య దానిని బట్టలు ఉతకడానికి ఉపయోగించడం గమనార్హం.
ఈ క్రమంలోనే 25 రోజుల కిందట బ్రిటన్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే.. అమెరికాకు చెందిన విమాన శకలాల అన్వేషకుడు బ్లెయిన్ గిబ్సన్ కు ఈ విమాన విడిభాగం కంటపడింది. ఈ భాగాన్ని వారు విశ్లేషించగా దీనిపై నాలుగు పగుళ్లు కన్పించాయి. సముద్ర జలాలను గట్టిగా తాకినపుడు విమానంలోని ఇంజన్ విచ్చినమై ఉంటుందని.. ఆ క్రమంలోనే తలుపుకు ఈ నాలుగు పగుళ్లు ఏర్పడి ఉంటాయని గుర్తించారు.
సాధారణంగా విమానాన్ని నీటిపై దించాల్సి వచ్చినపుడు పైలెట్లు చక్రాలను విచ్చుకునేలా చేయరని తెలిపారు. ఇలా చేస్తే విమానం త్వరగా మునిగిపోయి అందులోని ప్రయాణికులు తప్పించుకునే సమయం లభించదని తెలిపారు. అయితే ఈ విమాన పైలట్లు మాత్రం సముద్ర జలాలన్నీ వీలైనంత వేగంగా ఢీ కొట్టించడంతో పాటు విమాన చక్రాలు విచ్చుకునేలా చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఈ కారణంగానే విమాన తలుపుపై భారీ పగుళ్లు ఏర్పడి ఉంటాయని తెలిపారు. వీలైనంత ఎక్కువగా ఎంహెచ్ 370 విమానాన్ని ముక్కలు చేయాలనే తలంపు కుట్రదారుల్లో కన్పిస్తుందనే అభిప్రాయాన్ని రిచర్డ్ గాడ్ ఫ్రే.. బ్లెయిన్ గిబ్సన్ లు వెల్లడించారు. ఏది ఏమైనా ఎనిమిదేళ్ళ క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం మిస్టరీ ఇంకా వీడకపోవడం శోచనీయంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.