ఏపీ ప్రభుత్వం సంచలన విషయాలతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజద్రోహం కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు రెండు ప్రముఖ న్యూస్ చానెళ్లపై ఏపీ సీఐడీ కేసులు నమోదుచేసిన సంగతి తెలిసింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుకు రెండు తెలుగు న్యూస్ చానెళ్ల నుంచి డబ్బులు అందాయని..అందుకు ప్రతిఫళంగా ఆ చానళ్ల వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎంపీ తన పదవిని వినియోగించారంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయ వార్తలను ప్రచురించే బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ లో దీన్ని ప్రచురించారు.
రెండు తెలుగు న్యూస్ చానెళ్లతోపాటు టీడీపీతో రఘురామరాజు కుమ్మక్కైయ్యారని అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొందట.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేశారంటూ అఫిడవిట్ లో ఆరోపించింది. ఆ సమయంలో ఆ రెండు చానళ్లకు.. రఘురామకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని ప్రస్తావించింది.
ఒక న్యూస్ చైర్మన్ ఎంపీ రఘురామకు ఏకంగా 10 లక్షల యూరోలు (రూ.8.8 కోట్లు) బదిలీ చేసినట్లుగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. దీనికి బదులుగా క్విడ్ ప్రోకో లో భాగంగా ఎంపీ రఘురామ ఆ చానళ్లలోని వ్యక్తుల ప్రయోజనాల కోసం తన పదవిని వినియోగించారని అఫిడవిట్ లో పేర్కొంది.
వాక్ స్వాతంత్ర్యం పేరుతో మీడియాలోని కొన్ని సంస్థలు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. రఘురామ చేసిన ప్రసంగాలను ముందుగా ప్రణాళిక బద్దంగా సిద్ధం చేసి వాటిని ప్రసారం చేశారని అఫిడవిట్ లో పేర్కొన్నారని బార్ అండ్ బెంచ్ ప్రచురించింది. చానళ్లతోపాటుగా టీడీపీ నేతలు, రఘురామరాజు కూలంకషంగా చర్చించుకున్న తర్వాతనే వాటి ప్రసారాలు జరిగాయని వివరించింది. టీడీపీ అధినేత చంద్రబాబు దీనివెనుక ఉన్నట్లుగా అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
ఈ సందర్భంగా రఘురామ రాజుతో చంద్రబాబు-లోకేష్ మధ్య సాగిన ఫోన్ సంభాషణలను వారి మధ్య జరిగిన డాక్యుమెంట్ల షేరింగ్ వంటి ఆధారాలను వైసీపీ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా బయటపెట్టినట్లు కథనంలో పేర్కొన్నారు.
రఘురామ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లో ఇవన్నీ ఉన్నాయని.. ఫోరెన్సిక్ రిపోర్టు, ఎలక్ట్రానిక్ వివరాలను కోర్టు ముందు ఏపీ ప్రభుత్వం ఉంచినట్లు కథనంలో పేర్కొంది. రఘురామకు వారికి మధ్య చాట్స్ ను ఆధారాలతో ఏపీ ప్రభుత్వం నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికలపై, మీడియా చానళ్ల ద్వారా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని అఫిడవిట్ లో ఆరోపించింది.
రఘురామ మీడియా సమావేశాలను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేశాయంటూ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు ఇలా చేసినట్టు ఉందని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొందని వెబ్ సైట్ లో పొందుపరిచారు.