కౌంట్‌ డౌన్‌ స్టార్ట్.. ఇక 24 రోజులే!

Update: 2017-08-30 08:23 GMT
భూమి అంతమై పోతుందా..? కలియుగాంతం వచ్చేసిందా..? బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా..? 2003 నుంచి ఇలాంటి వార్తలు వచ్చి మధ్యలో ఆగిపోయినప్పటికీ.. మరోసారి భూమి అంతం వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. భూమి అంతానికి సమయం ఆసన్నమైందని.. అందుకు మరో 24 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని కాన్‌ స్పిరసీ థియరిస్ట్‌ డేవిడ్‌ మీడ్‌ పేర్కొన్నారు.

వచ్చే నెలలో ప్రపంచం కనుమరుగు కానున్నదని, సెప్టెంబరు 20-23 మధ్య భూమిని నిబిరు అనే గ్రహం ఢీ కొడుతుందని చెప్పారు. దీంతో భూమి ముక్కలై.. జీవరాశి జాడ కూడా దొరక్కుండా పోతుందని తెలిపారు. ఈ ఘటన గురించి బైబిల్‌ - గిజా పిరమిడ్‌ లో స్పష్టంగా ఉందని వెల్లడించారు. భూమి ఈ ఏడాది అంతం అవుతుందని మీడ్‌ గతంలోనే చెప్పారు. తాజాగా భూమి అంతమయ్యే తేదీలను కూడా ఆయన ప్రకటించారు. సెప్టెంబర్‌ నెల మధ్యలో నిబిరు గ్రహం ఆకాశంలో ప్రపంచం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.

భూగ్రహాన్ని నిబిరు అనే గ్రహం ఢీకొట్టేందుకు దూసుకొస్తోందని డేవిడ్ మీడే 'ప్లానెట్ టెన్ - ది 2017 అరైవల్' అనే పుస్తకంలో గతంలోనే పేర్కొన్నారు. వందేళ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు విచ్ఛిన్నం చేసిందని అంటున్నారు. సౌర వ్యవస్థ చివరలో ఉన్న దీనిని పదో గ్రహంగా భావిస్తున్నారు. దక్షిణ ధ్రువం వైపు దూసుకొస్తున్న ఈ గ్రహం తనతోపాటు మరో ఏడు గ్రహాలను వెంటబెట్టుకొస్తున్నదని పేర్కొంటున్నారు.

నిబిరు అనేది ఓ ఊహాజనిత గ్రహం. సౌర కుటుంబానికి అంచున ఈ గ్రహం ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని ప్లానెట్‌ ఎక్స్‌గా కూడా పిలుస్తారు. 2016 జనవరి నెలలో తొలిసారిగా నిబిరు గ్రహ ప్రస్తావన వచ్చింది. కొన్ని వందల ఏళ్ల క్రితం మన గ్రహాల కక్ష్యల్లోకి ప్రవేశించిన నిబిరు గ్రహం వాటిని ఢీ కొట్టి సర్వనాశనం చేసింది. అయితే, ఇప్పుడు భూ కక్ష్యలోకి నిబిరు ప్రవేశించనుందని కాన్‌ స్పిరసీ థియరిస్ట్‌ లు భావిస్తున్నారు. ఇదే నిజమైతే భూమిపై జీవరాశులకు కాలం చెల్లినట్లే..! అయితే, అసలు నిబిరు అనే గ్రహం సౌర కుటుంబంలోనే లేదని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేగాక, నిబిరు - ఇతర గ్రహాల కథలన్నీ ఇంటర్నెట్‌లో ప్రచురించే కట్టుకథలని నాసా కొట్టిపడేసింది.
Tags:    

Similar News