ఆంధ్రప్రదేశ్ ఆర్ అండ్ బి శాఖ మంత్రి చింతకాలయ అయ్యన్న పాత్రుడి హత్యకు కుట్ర జరుగుతోందంటూ నెట్టింట్ లో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడే ఈ కుట్ర వెనుక కీలక పాత్రధారి అని చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సన్యాసి పాత్రుడు కొంతమంది మాట్లాడుతున్న ఓ వీడియో రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అది ఒక సీసీటీవీ ఫుటేజీ. సోదరుడు అయ్యన్న పాత్రుడిని చంపే ప్రణాళికను సన్యాసి పాత్రుడు వారితో చర్చిస్తున్నట్లు అందులోని దృశ్యాలను చూపించారు. దీంతో తీవ్ర కలకలం రేగింది.
ఈ వీడియో వ్యవహారం సన్యాసి పాత్రుడి దృష్టికి రావడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ నెల 21న నర్సీపట్నం సత్య కాంప్లెక్స్ లో తన స్నేహితుడు షేక్ అల్లా ఉద్దీన్ కుమార్తె వివాహానికి తన బంధువు చింతకాయల రమణ - గన్ మెన్ లతో కలిసి తాను హాజరయ్యానని తెలిపారు. ఆ వివాహానికి నాతవరానికి చెందిన పలువురు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారన్నారు. వరండాలో మెట్లు దిగుతున్న సమయంలో వారు ఎదురవడంతో మర్యాదపూర్వకంగా పలుకరించుకున్నామన్నారు. ఆ సమయంలో సీసీ టీవీ పుటేజ్ సేకరించి.. ఆ దృశ్యాలను కొందరు దుండగులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు కనిపిస్తోందన్నారు. సోదరుడిపై తాను ఎలాంటి కుట్రలు పన్నలేదని స్పష్టం చేశారు.
ఈ వీడియోపై విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీకి సన్యాసి పాత్రుడు ఫిర్యాదు చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని విన్నవించారు. సంబంధిత వీడియోను ఎవరు పోస్ట్ చేశారో గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సన్యాసి పాత్రుడు కుమారుడు వరుణ్ స్పందిస్తూ.. తన తండ్రి ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఓ పథకం ప్రకారం ఇలా కొందరు కుట్ర చేశారని ఆరోపించారు.