అవును! తెలంగాణ పోలీసులకు ఏమైంది? వారిలో ఎందుకు ఆత్మస్థైర్యం లోపిస్తోంది? ఎందుకు వారు ఉత్తుత్తినే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? ఉన్నతాధికారులు వీటిని ఎందుకు లైట్‌గా తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు పోలీసు వర్గాలనే కాకుండా సాధారణ ప్రజలను సైతం కలచి వేస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తమకు అందుబాటులో ఉండే తుపాకీతో ప్రజలకు ప్రాణ భిక్ష పెట్టాల్సిన పోలీసులు అదే ఆయుధంతో తమ ప్రాణాలను నిలువునా తీసేసుకుంటున్నారు దీంతో తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం కూడా ఉలిక్కిపడుతోంది.
విషయంలోకి వెళ్తే.. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఏఆర్ విభాగానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ చంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నారు. కరీనంగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న ఈయన.. కేవలం మానసిక ఆందోళనతో నే కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. విచారణ జరుగుతోందన్నారు. ఈ ఘటన ఈ రోజు ఉదయమే జరిగిందని వివరించారు. హైదరాబాద్ లో ఇటీవల వైద్యం చేయించుకున్నట్లు కమలాసన్ రెడ్డి చెప్పారు. శనివారం డ్యూటికి వచ్చి హెడ్ క్వార్టర్ లో సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఐజీ రవివర్మ సందర్శించి విచారం వ్యక్తం చేశారు.
కాగా, కరీంనగర్ సమీపంలోని బహుపేటకు చెందిన చంద్రయ్య.. రాంనగర్ లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి బార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఐదేళ్ళుగా డిప్రెషన్ లో ఉంటున్నాడని, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నాడని సమాచారం, ఇక, తెలంగాణలో ఇటీవల కాలంలో పోలీసుల ఆత్మహత్యలు షరామామూలుగా మారాయి. ఎస్సై స్థాయి అధికారులు సైతం ఏవో చిన్నపాటి కారణాలతో పోలీస్ స్టేషన్లలోనే ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ కలిచివేస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీటిపై దృష్టి పెట్టి.. పనివత్తిడిని దూరం చేయడంతోపాటు, వారిలో ఆత్మస్థైర్యం కల్పించేలా చూడాల్సిన బాధ్యత ఉంది.