కొత్త టెక్నాలజీతో రోడ్లను ఏర్పాటు చేయడానికి రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం వేస్తున్న రోడ్లు చాలా తొందరగా పాడైపోతున్న విషయం తెలిసిందే. పైగా తారు రోడ్లకు వర్షాలకు బద్ధ విరోధం. చిన్నపాటి వర్షం పడినా రోడ్డంతా పాడైపోతోంది.
తారురోడ్డుపై ఎక్కడన్నా గుంతలుంటే అందలో వర్షపు నీరు నిల్వఉంటోంది. గుంతల్లో నిల్వున్న వర్షపు నీరు తారును మొత్తం తినేస్తుంది.
దాంతో తారంతా వర్షపు నీటికి కరిగిపోవటంతో కంకర బయటపడుతోంది. వాహనాల తాకిదికి కంకరంతా చెల్లాచెదురైపోయి చివరకు గుంతలు పెరిగిపోతాయి. అందుకనే కొంతకాలానికి రోడ్లంతా గుంతలమయమైపోతున్నాయి.
ఈ విషయాలపైన సమీక్షించిన ఉన్నతాధికారులు కొత్త తరహా టెక్నాలజీతో రోడ్లు వేస్తే తారు పాడైపోయే సమస్య ఉండది అనుకుంటున్నారు. ఇప్పటికే కొత్త టెక్నాలజీతో రోడ్లను వేయటం ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయినట్లు గ్రహించారు.
కొత్త టెక్నాలజీతో రోడ్లు ఎలా వేస్తారంటే దెబ్బతిన్న రోడ్డును అడుగుమేర తవ్వేస్తారు. గుంతల్లోని వ్యర్ధాలను తొలగించకుండా అందులోనే ఉంచుతారు. గుంతలో సిమెంటు పొడి చల్లి ప్రత్యేకమైన కెమికల్ చల్లుతారు. తర్వాత రోటవేటర్ మెషీన్ సాయంతో గుంతలోని మిశ్రమాన్ని బాగా కలుపుతారు. రోడ్డులో ఎక్కడెక్కడ గుంతలున్నాయో అంతా అలాగే చేశాక సిమెంటు రోడ్లను చేసినట్లు కొద్దిరోజులు క్యూరింగ్ చేస్తారు. దీని ఫలితంగా రోడ్డంతా కాంక్రీట్ బేస్ లాగ తయారవుతుంది.
దాని నాణ్యత పరిశీలించాక అప్పుడు తారురోడ్డు వేస్తారు. ఈ టెక్నాలజీతో రోడ్డు జీవితకాలం కనీసం 10 ఏళ్ళుంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఎంత వర్షం పడినా రోడ్లపైన గుంతలు ఏర్పాడదన్నారు. ఎక్కడన్నా రోడ్లు దెబ్బతిన్నా అక్కడ మాత్రం బీటీ లేయర్ వేస్తే సరిపోతుందని నిపుణులు చెప్పారు. ఈ టెక్నాలజీని ఇప్పటికే పంచాయితిరాజ్ రోడ్లపైన ప్రయోగించారు. ఇదే విధానంలో తొందరలోనే ఆర్ అండ్ బీ రోడ్లను ఇదే సాంకేతిక పరిజ్ఞానంతో వేయనున్నట్లు చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీ అయినా వర్కవుటై రోడ్ల పరిస్ధితి బాగుపడితే అదే పదివేలు.