పౌరసత్వంపై పంతం నెగ్గించుకున్న అమిత్ షా

Update: 2019-12-09 12:56 GMT
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పంతం నెగ్గించుకున్నారు. విపక్షాలు వ్యతిరేకించినా పౌరసత్వ సవరణ బిల్లును లోక్ సభలో ఆమోదం పొందించుకున్నారు.

సోమవారం లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం అని విపక్షాలు అరిచిగోల పెట్టాయి.  కానీ డివిజన్ పద్ధతిలో స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 293 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 82మంది సభ్యులు ఓటేశారు. దీంతో సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది.

బీజేపీ ప్రవేశ పెట్టి పౌరసత్వ సవరణ బిల్లు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని విపక్షాలు ఆందోళన చేశాయి. టీఆర్ఎస్ , టీఎంసీ ఈ బిల్లును వ్యతిరేకించాయి. దేశంలోని పౌరులందరికీ సమానహక్కులు కల్పించే ఈ బిల్లు వల్ల ఇన్నాళ్లు ముస్లింలు, సిక్కులు ఇతర వర్గాలకున్న అదనపు హక్కులు ఇక ఉండవని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.  ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇండియాను బీజేపీ ఇజ్రాయిల్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

దీనిపై మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ బిల్లుతో రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కు విరుద్ధం కాదని.. సవరణ బిల్లుతో దేశంలో మెజార్టీ వర్గాలకు వివక్ష తప్పుతుందని అమిత్ షా తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాల్లో హిందువులు, సిక్కులకు వివక్ష ఉందని.. మన దేశంలో తాము అందరూ సమానం అని తెలిపేందుకే ఈ బిల్లు తెచ్చామని స్పష్టం చేశారు.
    

Tags:    

Similar News