హిజాబ్ పై యూపీ సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2022-02-17 15:30 GMT
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం నెమ్మదిగా దేశవ్యాప్తమైంది. గత నెలలో కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో హిజాబ్ ధరించిన కొందరు విద్యార్థీనీలు కాలేజీలోకి ప్రవేశించడాన్ని నిరాకరించారు. ఈ ఘటనతో నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి తర్వాత కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించాయి.

ఈ వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు, సామాజిక వేత్తలు, రచయితలు తమదైన శైలిలో స్పందిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఈ వివాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా హిజాబ్ వివాదంపై యోగి ఆదిత్యనాథ్ హాట్ కామెంట్స్ చేశారు. ‘ఏ ముస్లిం మహిళ హిజాబ్ ను ఇష్టానుసారంగా ధరించదని.. హిజాబ్ ను ముస్లిం మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారని అన్నారు. ట్రిపుల్ తలాక్ ను ఎవరైనా ఇష్టపడి అంగీకరించారా? అని ప్రశ్నించారు.

ఆ ఆడబిడ్డలను, సోదరీ మణులను అడగండని అన్నారు. తాను వారీ కన్నీళ్లను చూశానని.. వారు తమ కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

తలాక్ ను రద్దు చేసినందుకు జాన్ పూర్ కు చెందిన ఒక మహిళ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారన్నారు. దుస్తుల ఎంపిక వ్యక్తిగతమని.. ఆ వ్యక్తి ఇష్టంపై ఆధారపడుతుందన్నారు. తాను తనకు నచ్చిన దానిపై ఇతరులపై రుద్దలేదని చెప్పారు.

నా కార్యాలయంలో అందరినీ కండువా ధరించమని కోరగలనా? నా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆ విధంగా చెప్పగలనా? నేను అలా చేయలేనని యోగి అన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలని.. ఏదైనా ఉంటే సంస్థ .. ఆ సంస్థలో క్రమశిక్షణ ఉండాలని అన్నారు. ప్రస్తుతం హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది.

తనకు కాషాయ వస్త్రాలు ధరించడమే ఇష్టమని యోగి స్పష్టం చేశారు. తన అధికారులకు డ్రెస్ కోడ్ ను అమలు చేయనని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి తాను కోరుకున్నది ధరించొచ్చు.. ఆ స్వేచ్ఛ బహిరంగ ప్రదేశాలు, ఇళ్లకే పరిమితమని. కానీ ఎవరిపైనా డ్రెస్ కోడు రుద్దబోం.. ప్రతి సంస్థ యూనిఫాం నిబంధనను అనుసరించాలన్నారు.

ఒకవేళ పోలీస్ మ్యాన్ తాను ఒక మతానికి చెందిన వ్యక్తినని.. ఆ మత సంప్రదాయాలకు తగ్గ వస్త్రాలు ధరిస్తానంటే గందరగోళానికి దారితీస్తుందన్నారు. ముస్లిం మహిళలపై హిజాబ్ బలవంతంగా రుద్దిన ఆచారమే కానీ.. వారు తమ ఇష్టానుసారం ధరిస్తున్నది కాదని ఆదిత్యనాథ్ అన్నారు.
Tags:    

Similar News