వివాద స్వ‌రం : ఇళ‌య రాజా వ్యాఖ్య‌లే స‌బ‌బే అంటున్న మోడీ !

Update: 2022-04-16 10:30 GMT
గొప్ప సంగీతం తెలిసిన ఆయ‌న గొప్ప సంస్కారం తెలిసిన ఆయ‌న ఇప్పుడెందుకో దారి త‌ప్పి మాట్లాడ‌డ‌మే వివాదం. దేశంలో ఎన్నో వివ‌క్ష‌ల‌కు ఆన‌వాలు అయిన ఓ వ‌ర్గం నిమ్న వ‌ర్గం ఉన్న‌తికి సంగీత‌జ్ఞులు అయిన ఇళ‌య రాజా కారణం అయితే బాగుండు.. కానీ ఆయ‌న క్ర‌మం త‌ప్పి దారి త‌ప్పి కొన్ని మాట‌లు చెప్ప‌డం అస్స‌లు బాలేదు. ఇలా చెప్ప‌డం వ‌ల్ల ఆయ‌న‌కు శ‌త్రువులు పెరిగి, త‌ద్వారా విమ‌ర్శ‌లు అంతే క్ర‌మంలో పెరుగుతూ వ‌స్తున్నాయి. ముందు మోడీ అనే నాయ‌కుడు దేశానికి ముఖ్యంగా దారిద్ర్య నివార‌ణ‌కు ఏం చేశారో తెలుసుకున్నాక ఆయన్ను ద‌ళిత జాతి ఉద్ధార‌కుడిగా చూడ‌మ‌ని హిత‌వు చెబుతున్నాయి కొన్ని ప్ర‌జా సంఘాలు... ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో ..

రాజ్యాంగ సృష్టి క‌ర్త, నిర్మాత అయిన అంబేద్క‌ర్ కు మోడీకి ఏంటి పోలిక అని అనుకోవ‌ద్దు. ఆ విధంగా ఆయ‌న‌పై మ‌నం కోపం పెంచుకోవ‌ద్దు. మోడీ అయినా మ‌రొక‌రు అయినా ద‌ళితుల‌కు చేసే మేలే ప్ర‌ధానం అయి ఉండాలి. ఓ దేశ ప్ర‌ధాని నుంచి ఏం కోరుకోవాలో అదే కోరుకోవాలి. అంత‌కుమించి కోరుకుంటే అది అత్యాశే అవుతుంది. కానీ ద‌ళితులు నిత్యం ఏదో ఒక వెనుక‌బాటుతో ఏదో ఒక జాతి వివ‌క్ష తో బాధ‌ప‌డుతున్న వైనం మన దేశంలో ఉంది.

పండ‌గ రోజు కూడా  వారికి అవ‌మానాలు త‌ప్ప‌డం లేదు. పండ‌గ రోజు అంటే అంబేద్క‌ర్ జ‌యంతి రోజు అని అర్థం. ఆ విధంగా వీరంతా ఎప్ప‌టికప్పుడు ఏవో అవ‌మానాలు తీవ్ర దారిద్ర్యం అనుభ‌విస్తూ భ‌రిస్తూ స‌హిస్తూ స‌హ‌నాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అప్పువ‌డ్డ‌ది సుమీ భ‌ర‌త జాతి అని గుర్రం జాషువ వేద‌న చెందాడు. కానీ ఇప్ప‌టికీ ఆ అప్పు తీర‌లేదు. కాదు తీర్చ‌లేదు. కానీ ద‌ళిత వ‌ర్గం ఇప్ప‌టికే ఎంతో సాధించింద‌ని నాయ‌కులు చెప్ప‌డం వివాదాల‌కు నెల‌వు.

అలా చెప్ప‌డం త‌ప్పు అని కాదు కానీ అదేదో వాస్త‌వ రూపంలో  చేసి చూపిస్తే అప్పుడు వాళ్లు మాట్లాడే భాష స‌బ‌బు అని భావించాలి. కానీ ఆ ప‌ని నాయ‌కులు చేయ‌డం లేదు. వారినొక ఓటు బ్యాంకు గా చూస్తున్నారు. ఇందుకే దళిత బంధు ప‌థ‌కంకు అంత‌గా రావాల్సిన మైలేజ్ రావ‌డం లేదు. ఇందుకే ఎస్సీ కార్పొరేష‌న్ నిధులు అన్న‌వి ఏవీ స‌క్ర‌మంగా వినియోగానికి నోచుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ సంగీత‌జ్ఞులు స్పందించారు. ఆ వివాదం చూద్దాం.

నిన్న‌టి వేళ అంబేద్క‌ర్ కు మోడీకి పోలిక తెస్తూ మాట్లాడారు ఆయ‌న‌. బ్లూక్రాఫ్ట్‌ డిజిటల్‌ ఫౌండేషన్‌ వారు ముద్రించిన 'అంబేడ్కర్‌ అండ్‌ మోడీ- రిఫార్మెర్స్‌ ఐడియాస్‌, రిఫార్మర్స్‌ ఇంప్లిమెంటేషన్‌' అనే పుస్తకానికి 'ముందుమాట' రాశాక ఆయ‌న నుంచి వెలువ‌డిన మాటలే సంచ‌ల‌నాత్మ‌కం అయ్యాయి.

మోడీని అంబేద్క‌ర్ తో పోల్చారు. బాగుంది దేశంలో ఎవ్వ‌రూ చేయ‌లేన‌న్ని మంచి ప‌నులు చేశార‌ని కూడా అన్నారు. అంటే అన్నారు అవ‌న్నీ ఇళ‌యరాజా త‌న క‌ళ్ల‌తో చూశారా? లేదా హృదయంతో విన్నారా ? ఏమో మ‌రి! దేవుడికే ఎరుక
Tags:    

Similar News