అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన సంచలన హంతకుడి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సామ్యేల్ లిటిల్ అనే వ్యక్తి గత 50 ఏళ్లలో అమెరికాలోని 14 రాష్ర్టాలలో 90 మందికి పైగా వ్యక్తులను హత్య చేశాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ నేరాలన్నీ రుజువైతే ఇతడే అమెరికాలో అత్యంత కిరాతక సీరియల్ కిల్లర్ కాగలడని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రికార్డు 49 హత్యలకు పాల్పడిన గారీ రిడ్జ్‌వే అనే హంతకుని పేరు మీద ఉంది. సామ్యేల్ లిటిల్ అర్ధశతాబ్దం పాటు అంతమందిని వరుసగా చంపేస్తుంటే ఎంతో ప్రతిభావంతమైనవిగా చెప్పుకొనే అమెరికన్ పోలీసు విభాగాలు 2012వరకు అతడిని పట్టుకోలేకపోవడం గమనార్హం.
లిటిల్ చేసిన హత్యల ఉదంతాలు ఒక్కొక్కటి గగుర్పాటును కలిగిస్తున్నాయి. 36 ఏళ్ల క్రితం చేసిన హత్యకు సంబంధించిన వివరాలను అతడు ఇప్పటికీ ఉన్నదున్నట్టుగా వివరించడం అధికారులను విస్మయానికి గురిచేస్తున్నది. లైంగిక వాంఛలను తీర్చుకోవడానికే అతడు హత్యలు చేసేవాడని, గొంతు పిసికి చంపడం ద్వారా లైంగిక తృప్తిని పొందేవాడని లాస్‌ఏంజిల్స్ ప్రాసిక్యూటర్ బేత్ సిల్వర్‌మన్ పేర్కొన్నారు. ఇతని చేతిలో ప్రాణాలు వదిలినవారిలో అత్యధికులు పేదలు, మత్తుమందుల బానిసలే. తన పాపాలన్నీ దేవునికి తెలుసునని, అందుకే ఆయనను క్షమాపణ కోరడం లేదని లిటిల్ చెప్పడం కొసమెరుపు.
ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో.. జైలులో ఉన్న సామ్యుల్‌ను గత కొద్ది వారాలుగా పలు రాష్ర్టాలకు చెందిన దర్యాప్తు అధికారులు దాదాపు ప్రతిరోజూ వచ్చి కలుస్తున్నారు. ప్రస్తుతం వీల్‌చైర్‌కు పరిమితమైన ఆయన వయస్సు 78 ఏళ్లు! లాస్‌ఏంజిల్స్‌లో ముగ్గురు మహిళలను హత్య చేసిన కేసులో ఇతడు మూడు జీవిత ఖైదులను అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం మోపిన నేరాలు రుజువైతే ఆయనకు సంచలన రీతిలోనే శిక్ష ఉండవచ్చని అంటున్నారు.