దేశం మొత్తాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ.. విదేశాల దృష్టిని ఆకర్షించిన ఈ ఉదంతంలో కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని అత్యంత దారుణంగా.. హేయంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. ఆమెను బస్సులో నుంచి తోసేయటం.. తీవ్ర గాయాలతోఆమె పోరాడి మరణించటం తెలిసిందే. దేశం మొత్తాన్ని కదిలించిన ఈ ఘటనలోనిందితులకు సంబంధించినకేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. చివరి దశకు చేరుకున్న ఈ కేసు విచారణ సందర్భంగా తాజాగా నిందితుల తరఫున కేసు వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ ఎంఎల్ శర్మ సంచలన ప్రకటన చేశారు.
2012లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కోర్టు విచారణ అనంతరం బయటకు వచ్చిన డిఫెన్స్ లాయర్.. నిర్భయ ప్రైవేటు పార్ట్స్ లోకి ఇనుపరాడ్ దూర్చి అవయువాల్ని బయటకు లాగారని.. ఆ కారణంగా చోటుచేసుకున్న తీవ్ర గాయాలతోఆమె మరణించినట్లుగా పోలీసులు కోర్టుకు నివేదించటాన్ని ఆయన తప్పు పట్టారు. నిందితులు నిర్భయ విషయంలో ఇనుప రాడ్ ను దూర్చారన్న అంశాన్ని నిరూపిస్తే తానురూ10లక్షలు బహుమతిని ఇస్తారని ప్రకటించటం సంచలనంగా మారింది.
పోలీసులు కావాలనే ఇలాంటి అంశాల్ని పేర్కొన్నారని.. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగిన తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చిన శర్మ.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు పార్ట్స్ లో ఇనుప రాడ్ ను దూర్చి పేగులు బయటకు లాగారన్నది పోలీసులు అల్లిన కట్టుకథగా చెప్పారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఒకరు మూడేళ్ల క్రితం తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా.. మరో నిందితుడు బాల నేరస్తుడు (నేరం జరిగిన నాటికి) కావటంతోమూడేళ్లు రిఫామ్ హోమ్ లో ఉంచి విడుదల చేశారు.
పోలీసులు పేర్కొన్నదే నిజమైతే.. అత్యాచారానికి గురైన బాధితురాలు చెప్పిన సాక్ష్యంలో కానీ.. ఆమె స్నేహితుడు ఇచ్చిన వాంగ్మూలంలో కానీ ఇనుప రాడ్అంశం లేదన్నారు. ఆమెకు వైద్యంచేసిన వైద్యులు కానీ.. సింగపూర్ వైద్యులుకానీ ఇనుప రాడ్ ఉదంతాన్ని ప్రస్తావించలేదని గుర్తుచేశారు. ఒకవేళ ఇనుప రాడ్ వెజీనాలో నుంచి లోపలికి పెట్టి ఉంటే యూట్రస్ కు గాయం కాకుండా పేగుల వరకు వెళ్లే అవకాశం లేదని హ్యుమన్ అనాటమీ చెబుతుందని ఆయన వాదిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుప రాడ్ అంశం లేకున్నా పోలీసులు ఎలా ఆ అంశాన్ని వాదిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.