తల్లితండ్రులు అదేపనిగా పెళ్లి సంబందాలు చూస్తున్నప్పుడు ఎవరైనా ఏమి చేస్తారు? ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, అదేదో యాడ్ లో చూపిస్తున్నట్లు మరో మూడేళ్లు పడుతుంది నాన్నా అనో చెప్పాలి. లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని నచ్చచెప్పాలి ఇది సాదారణంగా జరిగే విషయం. ఇలా చెబితే వినడంలేదో లేక రొటీన్ కి భిన్నంగా ఆలోచించాలనో అదీగాక.. సినిమాలు ఎక్కువగా చూసిన అనుభవమో కానీ... తల్లిదండ్రులు చూస్తున్న వివాహ సంబంధాలకు పుల్ స్టాప్ పెట్టాలనుకున్న ఓ యువతి డిఫరెంట్ గా ఆలోచించింది. అది కాస్త బెడిసికొట్టడంతో.. మొదటికే మోసం వచ్చింది.
ముంబయికి చెందిన 22 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ చదువుకుంటోంది. ఆ యువతికి ఆమె తండ్రి పెళ్లి చేయాలనుకున్నాడు. అయితే అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి తండ్రి చేస్తున్న పెళ్లి ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయమై తన స్నేహితులతో చర్చించింది. ఈ విషయంలో "అతి"తెలివైన ఒక స్నేహితుడు ఒక సూచన చేశాడు. ఆమె తండ్రి పెళ్లి ప్రయత్నాలు చేయకుండా ఉండాలంటే.. ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నట్లు ఒక సీన్ క్రియెట్ చేయమనేది ఆ సలహా సారాంశం. ఇదేదో కొత్త ఆలోచన అని భావించిందో ఏమోకానీ.. తన స్నేహితుడైన ఓ యువకుడితో పెళ్లి జరిగిపోయిందని, ఇతడే భర్త అని తల్లిదండ్రులకు పరిచయం చేసింది ఆ యువతి. అబద్దం మరింత బలంగా ఉండటం కోసమన్నట్లు ఒక నకిలీ వివాహ సర్టిఫికెట్ ను కూడా సృష్టించింది. అప్పుడే మొదలైంది అసలు సమస్య.
దీంతో ఇన్నాళ్లూ స్నేహితుడిగా మాత్రమే ఉన్నా ఆ ఉత్తుత్తి భర్త... యువతికి తెలియకుండా తన పెళ్లిని అధికారిక రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు నిజమైన భర్తలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోయే సరికి అత్యాచారం జరిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. ఉత్తుత్తి పెళ్లి విషయం తల్లిదండ్రులకు చెప్పేస్తానని, కాకపోతే వారిని చంపేస్తానని ఈ ఉత్తుత్తి భర్త భయపెట్టడం మొదలుపెట్టాడు. ఇక భరించడం కష్టం అని భావించిన యువతి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 376 - 420ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. తెలిసీ తెలియని తెలివి తేటలతో తింగరి తింగరి నిర్ణయాలు తీసుకుంటే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో ఈ విషయం చక్కగా చెబుతుంది కదా!