వాడొక డ్రైవర్. విశాఖ నగరంలోని కంచరపాలెం అతడి స్వస్థలం. వృత్తి కారు డ్రైవర్. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల వేట.. లావుగా ఉండే మహిళలే వీడి టార్గెట్.. పెళ్లి అయినా కాకున్నా లావుగా ఉన్నారా వలవేస్తాడు.. లోబరుచుకుంటాడు.. ఆ తర్వాత డబ్బు, నగలు దోచుకొని ఉడాయిస్తాడు. అప్పటికే 30 మంది మహిళల వరకు వీడి చేతిలో మోసపోయారు. మోసపోయిన ఒక మహిళ ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కామ పిశాచి లీలలు బయట పడుతున్నాయి.
విశాఖలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్ కు భార్య - ఇద్దరు పిల్లలున్నారు. కారుడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే విశాఖలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో తిష్టవేసి లావుగా ఉండే మహిళలను టార్గెట్ చేస్తాడు. తానొక డాక్టర్ ను అని.. మీరు లావుగా ఉన్నారని బరువు తగ్గాలని పరిచయం పెంచుకుంటాడు. విశాఖ బీచ్ రోడ్డు లో వాకింగ్ చేసే లావుగా ఉండే మహిళలను కూడా ఆకర్షించి ఇలానే వల వేసాడు.
తాజాగా విశాఖలోని వేపగుంటకు చెందిన ఒంటరి మహిళ (31) తమ బంధువులను పరామర్శించేందుకు కేర్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ అజిత్ కుమార్ ఈమెకు వలవేశాడు. లావుగా ఉన్నావని బరువు తగ్గాలని తాను వైద్యుడినంటూ పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా దగ్గరయ్యాడు. భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న ఆమెను నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. అలా సన్నిహితంగా ఉన్నప్పుడు తన స్నేహితుడు మణికంఠ ద్వారా ఫొటోలు, వీడియో లు తీయించాడు. ఆ తర్వాత మణికంఠ ద్వారా సదురు మహిళను బెదిరించి ఆమె దగ్గర భారీగా డబ్బులు - నగలు దోచేశాడు. ఆ తర్వాత అజిత్ కుమార్ దూరంగా జరగడంతో మహిళకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారించగా అజిత్ కుమార్ బండారం బయటపడింది. ఇలానే 30 మంది మహిళల వరకు అజిత్ కుమార్ లోబరుచుకొని దోచుకున్నాడని తెలిసింది.
ఇలా కీచక డ్రైవర్ ఏకంగా 30 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకొని డబ్బు, నగలు, సర్వస్వం దోచుకున్న వ్యవహారం ఒక మహిళ చేసిన ధైర్యంతో వెలుగుచూసింది. వాడిని కటకటాల పాలు చేసింది.