యాదృచ్చికమే కావొచ్చు. కానీ.. పోలికల్ని చూస్తే వణుకు పుట్టటమే కాదు.. శుక్రవారం కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఎక్కాలంటే ప్రయాణికులు వణికిపోతారేమో? నిన్న (శుక్రవారం) రాత్రి ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసిందే. వేగంగా వెళుతున్న ట్రైన్.. వేరే లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైల్ ను ఢీ కొనటం.. ఆ వెంటనే బోగీలు గాల్లోకి లేచి.. కిందపడిపోవటం.. కొన్ని నిమిషాల్లోనే బెంగళూరు - హౌరా ఎక్స్ ప్రెస్ రైలు ఆ బోగీల్ని ఢీ కొని పట్టాలు తప్పటం తెలిసిందే. ఈ ఉదంతంలో గంటలు గడిచేకొద్దీ.. మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఇదిలా ఉంటే.. పద్నాలుగేళ్ల క్రితం ఇలాంటి శుక్రవారం వేళ.. ఇంచుమించు అదే టైంలో.. అదే కోరమండల్ ఎక్స ప్రెస్ ప్రమాదానికి గురైన ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు. పద్నాలుగేళ్ల క్రితం అంటే 2009 ఫిబ్రవరి 13న ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఆ రోజున జరిగిన ప్రమాదం కూడా రాత్రి ఏడున్నర నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వేళలోనే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు.
అప్పుడు కోరమండల్ ఎక్స్ ప్రెస్ వేగంగా జైపుర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతున్న వేళ.. ట్రాక్ మారే సమయంలో అదుపు తప్పి పట్టాల్ని తప్పటంతో బోగీలు పక్కకు పడిపోయాయి. ఇంజిన్ మరో ట్రాక్ మీద పడిపోయింది. ఆ సమయంలో 16 మంది దుర్మరణం చెందితే.. తాజా ఉదంతంలో మాత్రం అంతకు 200 రెట్లకు పైనే మరణాల సంఖ్య ఉండటం గమనార్హం. తాజా ప్రమాదం నేపథ్యంలో నాటి ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటున్న వారు.. యాదృచ్చికంగా జరిగినట్లుగా కనిపిస్తున్న అంశాల్ని చూసి విస్మయానికి గురవుతున్నారు.