ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఏపీలోఅలజడి సృష్టిస్తుంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీనితో కరోనా వైరస్ సోకిందనే అనుమానాలతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను ఐసొలేషన్ వార్డులో చేర్చారు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు. చిన్న బజారుకు చెందిన అతను రెండు రోజుల నుంచి దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో పాటు ఇటలీలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. అతని నుండి రక్త నమూనాలను సేకరించి కరోనా నిర్దారణ కోసం తిరుపతిలోని స్విమ్స్ కు పంపించారు.
అక్కడి నుంచి నివేదిక వస్తే తప్ప , అతనికి కరోనా సోకిందో లేదో తెలియదు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ఈ ఘటనతో నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కరోనా వైరస్ బారిన పడి చైనా తరువాత అత్యధికంగా మరణాలను నమోదైన ఇటలీ నుంచి ఆయన రావడం.. వచ్చిన రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ప్రాణాంతక వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి వివరాలను తెప్పించుకొన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇకపోతే , ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యల పై ప్రభుత్వం బులిటెన్ విడుదల చేశారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి 466 ప్రయాణికులు ఏపీకి వచ్చారు. 234 ప్రయాణికులు ఇళ్ల వద్ద వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 226 మందికి 28 రోజుల పరిశీలన పూర్తి అయింది. ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉంది. 36 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా వీరిలో 34 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మిగిలిన ఇద్దరి శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు.