ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్... తెలంగాణ లో తనదైన శైలిలో విజృంభిస్తోంది. ఇప్పటికే 9 మంది ప్రాణాలను హరించేసిన కరోనా... శుక్రవారం తాజాగా మరో ఇద్దరిని బలి తీసుకుంది. వెరసి తెలంగాణలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. ఇక ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రాష్ట్రం లో అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెరసి ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ సెంచరీని దాటేసి 229కి చేరుకుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా... కరోనా పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న పరిస్థితులు చూస్తుంటే... మున్ముందు ఇంకెలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయాందోళను నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ సోకి చికిత్సలు తీసుకున్న అనంతరం ఆ వైరస్ బారి నుంచి ప్రాణాల తో బయటపడ్డ వారి సంఖ్య కూడా తెలంగాణలో అధికంగానే ఉందని చెప్పక తప్పదు. ఇప్పటికే ఈ వైరస్ కోరల్లో చిక్కుకుని చికిత్స అనంతరం ఆ వ్యాధి నుంచి 17 మంది క్షేమంగా బయటపడగా... తాజాగా శుక్రవారం ఈ వైరస్ కోరల్లో నుంచి ఏకంగా 15 మంది బయటపడ్డారు. దీంతో కరోనా కోరల్లో చిక్కుకుని ప్రాణాల తో బయటపడ్డ వారి సంఖ్య రాష్ట్రంలో 32కు చేరుకుంది. వెరసి కరోనా వైరస్ బారిన పడి ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 186 గా తేలింది.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే విషయంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబడ్డ తెలంగాణ లో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న వైనం ఆసక్తికరమేనని చెప్పాలి. ఈ నెల 7 నాటికి రాష్ట్రాన్ని కరోనా ఫ్రీ రాష్ట్రంగా మార్చేస్తామని సీఎం కేసీఆర్ ఓ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కట్టడికి ఎంతమేర కఠిన చర్యలు తీసుకుంటున్నా... నానాటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం చూస్తుంటే.. కేసీఆర్ ప్రకటన సాకారమయ్యే పరిస్థితులు లేవన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.