ఆంధ్రప్రదేశ్ లో అదుపులోనే కరోనా ఉందని ఆ రాష్ట్ర వైద్య అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది వైరస్ నాలుగో దశ వ్యాప్తికి సూచికనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే.. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఫీవర్ సర్వేలు నిర్వహిస్తూ కరోనా కట్టడి చర్యలు సమర్థంగా అమలు చేస్తోందని వైద్య ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే 99 శాతం ప్రజలకు కరోనా టీకా రెండు డోసులు వేశామని వివరిస్తున్నారు. అందువల్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో క్రమంగా కేసులు పెరుగుతునప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకర స్థాయిలో పరిస్థితులు లేవంటున్నారు.
ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహిస్తూ కరోనా వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లెం వేస్తోందని వైద్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి పరీక్షలు చేస్తున్నారు.
తద్వారా వైరస్ బాధితులను ముందే గుర్తించి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫీవర్ సర్వేను నిరంతరాయంగా చేపట్టాలని వైద్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 46వ విడత ఫీవర్ సర్వేలో భాగంగా 1.63 కోట్ల గృహాలను వైద్య సిబ్బంది సందర్శిస్తున్నారు.
కాగా జూన్ 4 నుంచి 10వతేదీ మధ్య దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 15,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 13,771, కర్ణాటకలో 2,831, తమిళనాడులో 1,157, తెలంగాణలో 785 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో 128 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగు చూశాయి. ఇక గత మూడు రోజుల్లో వరుసగా 23, 18, 33 పాజిటివ్ కేసులు వచ్చాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 15 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజర్లలో 99.65 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం 24.41 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా అంతకు మించి 25,33,439 మందికి తొలి డోసు పంపిణీ చేసి జాతీయ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. తొలి డోసు తీసుకున్న వారిలో 25,24,553 (99.65 శాతం) మందికి రెండో డోసు టీకా కూడా పూర్తయింది. 12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల్లో 97.78 శాతం మందికి రెండు డోసుల టీకాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఈ వయసు పిల్లలు 14.90 లక్షల మంది ఉండగా ఇప్పటికే వంద శాతం తొలి డోసు పంపిణీ పూర్తయింది.